ఫాన్స్‌ని చీట్‌ చేస్తోన్న ఇలియానా!

ఫాన్స్‌ని చీట్‌ చేస్తోన్న ఇలియానా!

బాయ్‌ఫ్రెండ్‌తో తెగతెంపులు అయిన తర్వాత ఇలియానా మళ్లీ తిరిగి నటనతో బిజీ కావాలని చూస్తోంది. కానీ తనకిప్పుడు ఆఫర్లే రావడం లేదు. హిందీలో గతంలో వచ్చిన ఒకటీ అరా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. తెలుగులో అయితే 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' వల్ల ఇక మళ్లీ అవకాశాలు రాని పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్‌ మీద వర్క్‌ చేస్తోన్న ఇలియానా తన ప్రస్తుత లుక్‌ తాలూకు ఫోటోలు పెట్టడానికి అసలు ఇష్టపడడం లేదు.

ఇక సినిమాలొద్దని ఆమధ్య అనుకోవడం వల్ల రిలాక్స్‌ అయిన కారణంగానో, లేక బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ అయిన డిప్రెషన్‌ వలనో ఇలియానా ఈమధ్య షేప్‌ అవుట్‌ అయింది. మునుపటిలా ఆమెకిపుడు అవర్‌గ్లాస్‌ ఫిజిక్‌ లేదు. అయితే ఆ ఫోటోలు పెడితే ఫాన్స్‌ తగ్గుతారనో లేదా సినిమాలు అసలు రావనో ఇలియానా తన అసలు స్వరూపాన్ని దాచేస్తోంది.

అలా అని సోషల్‌ మీడియాలో ఇనాక్టివ్‌గా వుండలేదు కనుక పాత ఫోటోలని రీపోస్ట్‌ చేస్తూ కొత్త క్యాప్షన్లు పెడుతోంది. ప్రస్తుతం ఇలాగే వున్నాననే భ్రమ కల్పిస్తోంది. నిజంగానే ఇలియానా ఇప్పుడింత సెక్సీగా వుందని నమ్మేసి ఫాన్స్‌తో పాటు మీడియాలో కొందరు కూడా బకరాలు అవుతున్నారనుకోండి. అది వేరే సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English