శ్రీముఖి ఓట్లు లాగేసేది అతనే

శ్రీముఖి ఓట్లు లాగేసేది అతనే

'బిగ్‌బాస్‌' సీజన్‌ 3 విజేతగా శ్రీముఖిని నిలబెట్టడానికి ఆ షో డైరెక్టర్లు చేస్తోన్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. శ్రీముఖి ఆడే ఎస్కేపిస్ట్‌ ఆటకి వాళ్లు ఇచ్చే బిల్డప్పులు మామూలుగా వుండవు. షో స్టార్ట్‌ అయిన దగ్గర్నుంచీ ఫిజికల్‌ టాస్క్‌లలో ఎలా ఒళ్లు దాచుకుందో, ఎంతగా వుమన్‌ కార్డ్‌ ప్లే చేసిందో జనం చూస్తూనే వున్నారు. ఒక దశకి చేరిన తర్వాత ఇక ఫిజికల్‌ టాస్క్‌లు ఇవ్వడం మానేసి 'అష్టా చమ్మా' ఆటల్లాంటివి ఆడించడం మొదలు పెట్టారు.

శ్రీముఖిని హైలైట్‌ చేసే క్రమంలో బాబా భాస్కర్‌ని మాస్కర్‌ అంటూ ముద్ర వేయాలని చూసారు. ఎలాగయినా అతడిని ఫినాలేకి రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారు. కానీ తనని టార్గెట్‌ చేసే కొద్దీ బాబా స్ట్రాంగ్‌ అయ్యాడు. రెచ్చిపోయి టాస్క్‌లలో పార్టిసిపేట్‌ చేసి బిగ్‌బాస్‌ వాళ్లు కూడా ఇక తనని టార్గెట్‌ చేయనివ్వకుండా చేసాడు. ఫైనల్‌ ఫైవ్‌లో గ్యారెంటీగా వుండే బాబా భాస్కర్‌ మొదట్నుంచీ బిగ్‌బాస్‌ భయపడ్డట్టే తమ అనుకూల కంటెస్టెంట్‌ గెలవకుండా అడ్డు పడేలాగున్నాడు.

బాబాకి పోల్‌ అయ్యే ఓట్లలో అధిక శాతం శ్రీముఖి నుంచి షేర్‌ అవుతాయి. హౌస్‌లో అందరితో చెడిపోయినా కానీ బాబాని మాత్రం శ్రీముఖి దూరం చేసుకోలేదు. అతనికి యాంటీ కాకపోవడం వల్ల ఇద్దరి ఓటర్లు డివైడ్‌ అవకుండా వున్నారు. ఫైనల్‌లో శ్రీముఖి ఛాన్సులని ఎక్కువగా దెబ్బ తీసేది బాబానే అంటున్నారు బిగ్‌బాస్‌ ఎనలిస్టులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English