పాపం ఆ హీరో పనైపోయినట్టే

పాపం ఆ హీరో పనైపోయినట్టే

బ్యాక్‌గ్రౌండ్‌ వుంటే సినిమా రంగంలో సక్సెస్‌ అయిపోతారని ఎవరన్నారు. ఆది సాయికుమార్‌నే చూస్తే బ్యాక్‌గ్రౌండ్‌ వున్నంత మాత్రాన అవకాశాలు వస్తాయి కానీ సక్సెస్‌ రాదని ఒప్పుకుంటారు. సాయికుమార్‌ తనయుడు కావడంతో ఆదికి హీరోగా అవకాశాలు వచ్చాయి. అయితే కెరియర్‌ మాత్రం నిలబడలేదు. వరుస పరాజయాలతో ఇప్పుడిక చేతిలో సినిమా లేని పొజిషన్‌కి వచ్చాడు. ఇటీవల విడుదలైన అతని సినిమాలు బుర్రకథ, జోడి లాంటివి కనీసం పోస్టర్‌ ఖర్చులు కూడా రాబట్టుకోలేదు. అయితే ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌ తనకి లక్‌ తెస్తుందని ఆది ఆశించాడు. కానీ ఇది కూడా డిజాస్టర్‌ అవడంతో ఇప్పుడు తన చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు.

ప్రేమ కావాలి, లవ్‌లీ తర్వాత అతని సినిమాలకి కనీస ఆదరణ కూడా దక్కడం లేదు. దాదాపు డజను ఫ్లాపులతో ఇక నిర్మాతలు తనవైపు రాకుండా చేసుకున్నాడు. మధ్యలో సొంత డబ్బులు కూడా పోగొట్టుకున్నాడు. గరం అనే సినిమా షూటింగ్‌ మధ్యలో ఆగిపోతే ఆది ప్రోద్బలం మీద సాయికుమార్‌ సొంత డబ్బులు పెట్టి దానిపై చాలా పోగొట్టుకున్నాడు. సాయికుమార్‌కి ఇండస్ట్రీలో కనక్షన్స్‌ అయితే బాగానే వున్నాయి కానీ అసలు మార్కెట్‌ లేని ఆది మీద ఎవరు పెట్టుబడి పెడతారు? కనీసం సపోర్టింగ్‌ రోల్స్‌ లేదా విలన్‌గా అయినా అవకాశాలు ఇచ్చేవాళ్లు వుంటారేమో చూడాలని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English