చిరంజీవి కాదు.. బాలయ్యే తోపు

చిరంజీవి కాదు.. బాలయ్యే తోపు

తెలుగు సినీ పరిశ్రమలో గుర్రపు స్వారీకి పెట్టింది పేరు మెగాస్టార్ చిరంజీవి. ‘కొదమసింహం’, ‘కొండవీటి దొంగ’ లాంటి సినిమాల్లో ఆయన ఎంత అద్భుతంగా గుర్రాన్ని నడిపించాడో.. గుర్రపుస్వారీలో తనకంటూ ఎలా ఒక స్టయిల్ క్రియేట్ చేసుకున్నాడో తెలిసిందే.

ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ రామ్ చరణ్ సైతం గుర్రపుస్వారీలో పట్టు సాధించాడు. చిన్నతనంలోనే ఈ విద్య నేర్చుకుని ‘మగధీర’ సినిమాలో తన నైపుణ్యాన్ని చాటాడు. ఇక మెగాస్టార్ 64 ఏళ్ల వయసులో ఇటీవలే ‘సైరా’ సినిమాలో ఎలా గుర్రపుస్వారీలో తన నైపుణ్యాన్ని మరోసారి ఎలా చూపించాడో తెలిసిందే. ఐతే సీనియర్ కమెడియన్ బాబూ మోహన్ మాత్రం టాలీవుడ్లో గుర్రపుస్వారీ విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణను మించిన తోపు ఇంకొకరు లేదని అంటున్నారు.

తాజాగా తన ఆఫీసులో పిచ్చాపాటీగా మాట్లాడుతూ ఆయన బాలయ్య గుర్రపుస్వారీ నైపుణ్యం గురించి చెప్పారు. ‘‘భైరవద్వీపం సినిమాలో బాలకృష్ణ, నేను గుర్రం మీద వెళ్తాం. బాలకృష్ణ మొనగాడు గుర్రం నడపడంలో. ఆడతాడు గుర్రాలతో. ఎగిరి దూకుతుంటాడు. నిజంగా.. బాలకృష్ణ లాగా ఎవ్వరూ.. చిరంజీవి గిరంజీవి ఎవ్వరూ గుర్రం నడపజాలరు. ఏం పట్టుకోకుండా... కేవలం జూలు మాత్రమే పట్టుకుని పోతుంటాడు’’ అంటూ నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు బాబూ మోహన్.

దీనికి కొనసాగింపుగా.. ''తీటగాడు.. నేను తోకవైపు కూర్చుని నడుపుతుంటే.. నన్నొక తన్ను తన్నాడు'' అని బాబూ మోహన్ అన్నాడు కానీ.. అది బాలయ్యనుద్దేశించా.. మరొకరి గురించా అన్నది స్పష్టత లేకపోయింది. చిరుతో పోలుస్తూ బాలయ్య గురించి బాబూ మోహన్ ఇలా పొగిడేసరికి నందమూరి అభిమానులకు ఈ వీడియో కనువిందుగా అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English