'ధూమ్'ను వదిలేసి దీన్ని పట్టుకోబోతున్నారు

'ధూమ్'ను వదిలేసి దీన్ని పట్టుకోబోతున్నారు

హాలీవుడ్‌లో మాదిరి ఒక సినిమాను ఫ్రాంఛైజీగా మార్చి సినిమాలు తీసే సంస్కృతిని భారతీయ సినిమాకు పరిచయం చేసింది బాలీవుడ్డే. అక్కడ ఈ తరహాలో సూపర్ సక్సెస్ అయిన ఫ్రాంఛైజీ ‘ధూమ్’. ఈ సిరీస్‌లో వచ్చిన మూడు సినిమాల్లోనూ పోలీస్ పాత్రలో అభిషేక్ బచ్చన్ కనిపించగా.. దొంగ పాత్రధారి మారుతూ వచ్చారు.

తొలి చిత్రంలో జాన్ అబ్రహాం నటించగా ఆ సినిమా సూపర్ హిట్టయింది. తర్వాతి చిత్రంలో హృతిక్ రోషన్ దొంగగా కనిపించగా.. అది బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత హృతిక్ స్థానాన్ని ఆమిర్ ఖాన్ భర్తీ చేస్తూ ‘ధూమ్-3’లో నటిస్తే అది ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఐతే తర్వాత ఈ సిరీస్‌లో మరో సినిమా రాలేదు. దొంగ పాత్ర కోసం సల్మాన్, షారుక్‌ల పేర్లు వినిపించాయి కానీ.. ఈ సినిమా మాత్రం కార్యరూపం దాల్చలేదు.

ఐతే తాజా పరిణామాల్ని బట్టి చూస్తే ‘ధూమ్’ సిరీస్‌ ఇక వచ్చే అవకాశం లేదు. దీని స్థానంలో మరో యాక్షన్ ఫ్రాంఛైజీని నడిపించాలని యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవలే ఆ సంస్థ నుంచి వచ్చిన యాక్షన్ ధమాకా ‘వార్’ బ్లాక్ బస్టర్ అయింది. ఇందులో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ కండల వీరులిద్దరి విన్యాసాలు సినిమాకు పెద్ద ఆకర్షణగా నిలిచాయి. యాక్షన్ ప్రియులు సినిమా చూసి మైమరిచిపోయారు.

రూ.150 కోట్ల బడ్జెట్లో సినిమా తీస్తే వరల్డ్ వైడ్ దానికి మూడు రెట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తోందీ చిత్రం. దీనికి తోడు శాాటిలైట్, డిజిటల్, ఇతర హాక్కుల రూపంలోనూ యశ్ రాజ్ వాళ్లకు భారీగా ఆదాయం సమకూరింది. దీంతో ‘వార్’ను ఫ్రాంఛైజీగా మార్చి వరుసగా సినిమాలు తీయాలని యశ్ రాజ్ వాళ్లు డిసైడయ్యారు. ఈ సిరీస్‌లో హృతిక్ మాత్రం కొనసాగుతాడు. అతడిని ఢీకొట్టే హీరో మారుతాడు. ‘వార్’ దర్శకుడు సిద్దార్థ్ ఆనందే తర్వాతి చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English