బ‌న్నీ.. మ‌హేష్‌ను గిచ్చుతూనే ఉన్నాడుగా

బ‌న్నీ.. మ‌హేష్‌ను గిచ్చుతూనే ఉన్నాడుగా

సంక్రాంతికి రాబోయే రెండు భారీ చిత్రాల రిలీజ్ డేట్ విష‌యంలో ఉత్కంఠ కొన‌సాగుతోంది. అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠ‌పుర‌ములో.. మ‌హేష్ బాబు మూవీ స‌రిలేరు నీకెవ్వ‌రు పోటాపోటీగా ఒకే రోజు, జ‌న‌వ‌రి 12న విడుద‌ల‌కు సై అన్న సంగ‌తి తెలిసిందే. ముందు బ‌న్నీ సినిమాకే రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌గా.. గంట వ్య‌వ‌ధిలోనే మ‌హేష్ చిత్రానికి కూడా డేట్ ఇచ్చారు.

కాబ‌ట్టి ఎవ‌రు ముందు ఎవ‌రు వెనుక ప్ర‌క‌ట‌న ఇచ్చారు అన్న చ‌ర్చకు ఆస్కారం లేదు. ఐతే ఇలా ఒకే రోజు రెండు భారీ చిత్రాలు రిలీజ్ చేయ‌డం వ‌ల్ల అన్ని ర‌కాలుగా న‌ష్ట‌మే అని.. కాబ‌ట్టి ఎవ‌రో ఒక‌రు ముందుకో వెన‌క్కో జ‌రిగితే మంచిద‌ని అంటున్నారు ఇండ‌స్ట్రీ జ‌నాలు.

కానీ ఒక‌సారి డేట్ ఇచ్చాక మారిస్తే వెనుకంజ వేసిన‌ట్లు అవుతుంద‌నే ఉద్దేశంతో మ‌హేష్‌, బ‌న్నీ ప‌ట్టుద‌ల‌కు పోతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న గుస‌గుస‌ల ప్ర‌కారం అల వైకుంఠ‌పుర‌ములో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ 12నే వ‌స్తుంద‌ని.. మ‌హేష్ మూవీనే ఒక రోజు ముందు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. తాము త‌గ్గేది లేద‌నే సంకేతాలిస్తూ.. గ‌త వారం రోజుల్లో రిలీజ్ చేసిన ప్ర‌తి పోస్ట‌ర్ మీదా జ‌న‌వ‌రి 12న గ్రాండ్ రిలీజ్ అని వేస్తోంది అల వైకుంఠ‌పుర‌ములో టీం.

సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న పాటకు రికార్డు లైక్స్ రావ‌డం గురించి రిలీజ్ చేసిన పోస్ట‌ర్ కావ‌చ్చు.. సుశాంత్ పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తూ లాంచ్ చేసిన పోస్ట‌ర్ కావ‌చ్చు.. సినిమాలోని కొత్త పాట టీజ‌ర్ లాంచ్ గురించిన పోస్ట‌ర్లో కావ‌చ్చు.. ఇలా ప్ర‌తిదాంట్లో రిలీజ్ డేట్‌ను ప్ర‌ముఖంగా పొందుప‌రిచారు. మ‌రోవైపు మ‌హేష్ సినిమా టీం సైలెంటుగా ఉంటోంది. మ‌రి ఇప్పుడ‌నుకుంటున్న‌ట్లే మ‌హేష్ త‌గ్గుతాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English