ఎవరితో తింటున్నావ్‌ సమంత?

ఎవరితో తింటున్నావ్‌ సమంత?

ప్రస్తుతం సమంత తీరికవేళల్లో ఏం చేస్తోంది? ఎవరితో కలిసి మామిడి పళ్లు తింటోంది? కాస్త తీరిగ్గా ఆలోచిస్తే తేలిగ్గానే సమాధానం దొరుకుతుంది. ఎన్టీఆర్‌తో ‘రామయ్యా వస్తావయ్యా’, పవన్‌కళ్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు, మండుటెండలను కూడా లెక్కచేయకుండా షూటింగ్‌లో పాల్గొంది. ఒళ్ళుమండుతున్నా, గీరకొడుతున్నా కూడా సమంత చక్కగా తన పార్టును ఫినిష్‌ చేసేసింది.

ఈ బ్రేక్‌ రావడంతో ఏ ఫారిన్‌ కంట్రీనో వెళ్ళకుండా, చెన్నై వెళ్లి ఇంట్లోనే టైమ్‌పాస్‌ చేస్తోందిట. అంతేకాదు..అక్కడ మామిడి పళ్లు తింటూ తెగ ఎంజాయ్‌ చేస్తోంది. అయితే మామిడిపళ్లు ఎవరితో కలిసి తింటున్నట్టు? ..ప్రియుడు సిద్ధూ ప్రస్తుతం చెన్నైలోనే ఓ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంటున్నాడు. ఆ బిజీ నుంచి కాస్త తీరిక చిక్కితే సమంత చెంతనే వాలిపోతాడు గనుక ..తనతోనే కలిసి మామిడిపళ్లను ఆరగిస్తూ ఎంజాయ్‌ చేస్తోందేమో ఈ హాట్‌ గాళ్‌. ఏమంటారు?.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు