'బిగ్ బాస్' విన్నర్.. 'బిగ్ బాస్'పై నెగెటివ్ కామెంట్స్

'బిగ్ బాస్' విన్నర్.. 'బిగ్ బాస్'పై నెగెటివ్ కామెంట్స్

ఒకసారి 'బిగ్ బాస్' షోకు అలవాటు పడ్డవాళ్లు దాన్ని విడిచిపెట్టలేరు. ఇక ఒకసారి ఈ షోలో పాల్గొన్నవాళ్లు దాన్ని ఫాలో అవుతూనే ఉంటారు. విశేషాలు తెలుసుకుంటూనే ఉంటారు. ఇక 'బిగ్ బాస్'లో గతంలో టైటిళ్లు అందుకున్న వాళ్లు దాన్ని చూడకుండా ఉంటారా? పట్టించుకోవడం మానేస్తారా? 'బిగ్ బాస్' తొలి సీజన్లో విజేతగా నిలిచిన శివబాలాజీ ఇలాగే చేస్తున్నాడట.

అతను 'బిగ్ బాస్' మూడో సీజన్‌ను అస్సలు పట్టించుకోవడం లేదట. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివబాలాజీ మాట్లాడుతూ ఈ విషయం చెప్పాడు. తనకు ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టమని.. అయితే 'బిగ్ బాస్' మూడో సీజన్లో అదే లోపించిందని శివబాలాజీ అన్నాడు.

ఈ సీజన్‌కు తాను కనెక్ట్ కాలేకపోయానని.. ఆరంభంలో కొన్ని ఎపిసోడ్లు చూసినపుడే ఈసారి ఎంటర్టైన్మెంట్ ఉండదని తనకు పక్కాగా అర్థమైందని.. దీంతో ఆసక్తి తగ్గిందని.. దీనికి తోడు షూటింగ్, వ్యక్తిగత పనులతో బిజీ అయిపోవడంతో పూర్తిగా 'బిగ్ బాస్' చూడటమే మానేశానని.. రెండో సీజన్‌ను మాత్రం తాను బాగా ఫాలో అయ్యానని అన్నాడు శివబాలాజీ.

'బిగ్ బాస్' గత రెండు సీజన్లలో ఆకర్షణకు లోటు లేదు. తొలి సీజన్‌కు హోస్ట్ ఎన్టీఆరే అతి పెద్ద ఆకర్షణ. పార్టిసిపెంట్లు కూడా ఉన్నంతలో బాగానే ఎంటర్టైన్ చేశారు. ఇక రెండో సీజన్లో హోస్ట్ నాని ఓకే అనిపించగా.. కౌశల్ వెర్సస్ మిగతా కంటెస్టెంట్ల పోరు రసవత్తరంగా సాగి షో రక్తి కట్టింది. కానీ ఈ ఏడాది హోస్ట్ నాగార్జున అనుకున్నంత స్థాయిలో షోను నడిపించట్లేదు. పార్టిసిపెంట్లు కూడా అంతంతమాత్రంగా ఉన్నారు. దీంతో అంతకంతకూ ఆసక్తి తగ్గిపోయి రేటింగ్స్ పడిపోయాయి. షో భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English