'అల వైకుంఠపురంలో' ఈసారి పిచ్చ మాస్‌రో

'అల వైకుంఠపురంలో' ఈసారి పిచ్చ మాస్‌రో

'అల వైకుంఠపురములో' మొదటి పాట యూట్యూబ్‌లో ఇంకా రచ్చ చేస్తూనే వుంది. నలభై మిలియన్లకి పైగా వ్యూస్‌తో ఏడు లక్షలకి పైగా లైక్స్‌తో ఈ పాట వైరల్‌ అయిపోయింది. సంక్రాంతికి రానున్న ఈ చిత్రానికి ఇప్పుడే బోలెడంత క్రేజ్‌ తెచ్చిపెట్టిన ఈ పాటతో నిర్మాతలలో ఉత్సాహం పెల్లుబుకుతోంది. అందుకే ఈసారి మరో పాట కూడా విడుదల చేయాలని డిసైడ్‌ అయ్యారు. మొదటి పాట మెలొడి కాగా ఈసారి రిలీజ్‌ చేసే పాట పిచ్చ మాస్‌ అట. సూపర్‌ మచ్చి, బ్లాక్‌బస్టరే పాట తరహాలో ఇది కూడా మాస్‌ని, యూత్‌ని ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు.

అరవింద సమేత చిత్రంలో తన మార్కు సంగీతం అందించే అవకాశం రాకపోవడంతో తమన్‌ అందులో థీమ్‌కి అనుగుణంగా పాటలు ఇచ్చాడు. ఈసారి పూర్తి కమర్షియల్‌ ఆల్బమ్‌ చేసే అవకాశాన్ని త్రివిక్రమ్‌ ఇవ్వడంతో తమన్‌ రెచ్చిపోతున్నాడు. అల్లు అర్జున్‌ సినిమాలలో పాటలు సహజంగానే బాగుంటాయి. ఈసారి భారీ పోటీలో విడుదలవుతోంది కనుక పాటల పరంగా ఇంకా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇప్పటికే అల వైకుంఠపురములోకి ఏర్పడ్డ క్రేజ్‌తో సరిలేరు నీకెవ్వరు చిత్రంపై ఒత్తిడి పెరిగింది. ఇక ఈ మాస్‌ పాట కూడా రచ్చ చేసినట్టయితే అది మహేష్‌ చిత్ర నిర్మాతలపై మరింత ప్రెజర్‌ పెడుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English