'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'కీ దేవరకొండ ఎడిటింగ్‌?

'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'కీ దేవరకొండ ఎడిటింగ్‌?

'డియర్‌ కామ్రేడ్‌' చిత్రానికి దర్శకుడు చెప్పిన కథ ఒకటయితే, దానిని తనకి అనుగుణంగా మార్చుకోవడమే కాకుండా ఫైనల్‌ కట్‌ ఎలాగుండాలనేది కూడా విజయ్‌ దేవరకొండ నిర్ణయించాడని, అతనికి వున్న క్రేజ్‌ దృష్ట్యా నిర్మాతలు కూడా అడ్డు చెప్పలేదని అప్పట్లో వదంతులు వినిపించాయి. తన సినిమాలని ఎలా మార్కెట్‌ చేసుకోవాలనే విషయంలో దేవరకొండ ఎప్పుడూ తానే నిర్ణయం తీసుకుంటూ వుంటాడు. అయితే 'డియర్‌ కామ్రేడ్‌' విషయంలో ఆ ఇంటర్‌ఫియరెన్స్‌ మోతాదు మించిపోయిందట.

ఆ సినిమా ఫలితం తర్వాత తదుపరి చిత్రానికి అయినా విజయ్‌ తన పని మాత్రమే చేసుకుంటాడని అనుకున్నారు కానీ షూటింగ్‌ పూర్తయిపోయిన తర్వాత ప్రోడక్ట్‌ తన చేతిలో పెట్టాలని, దానిని తన ఫాన్స్‌కి నచ్చే రీతిన మలచిన తర్వాతే మార్కెటింగ్‌ మొదలు పెడదామని విజయ్‌ అంటున్నాడట. అందుకే ఇంతవరకు ఈ చిత్రానికి ప్రమోషన్‌ కూడా మొదలు పెట్టలేదట. షూటింగ్‌ పూర్తయ్యే దశకి వచ్చినా కానీ ఇంతవరకు రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌ చేయలేదు. అవసరమైతే రీషూట్స్‌ చేద్దామని, ఆలస్యమయితే సమ్మర్‌లోనే విడుదల చేద్దామని కూడా నిర్మాతని కన్విన్స్‌ చేసాడని గుసగుసలాడుకుంటున్నారు. మార్చి తర్వాత కానీ ఈ చిత్రం విడుదల కాదనేది ఇండస్ట్రీ టాక్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English