బూతు కంటెంట్‌పై సెన్సార్‌ కొరడా

బూతు కంటెంట్‌పై సెన్సార్‌ కొరడా

సినిమాలపై సెన్సార్‌ నిబంధనలు నిక్కచ్చిగా అమలు చేసే మన దేశంలో ఓటీటీ కంటెంట్‌పై మాత్రం ఇంతవరకు నియంత్రణ లేదు. దీంతో విదేశీ కంటెంట్‌కి ఏమాత్రం తీసిపోని రీతిన అడల్ట్‌ కంటెంట్‌ని నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌లో వదులుతున్నారు. అవసరానికి మించి శృంగార దృశ్యాలు, చుంబన దృశ్యాలు వీటిలో కామన్‌ అయిపోతున్నాయి. అలాగే మతపరమైన ఘర్షణలు చెలరేగే కంటెంట్‌ కూడా కొన్ని సిరీస్‌లలో కనిపిస్తోంది. దీంతో ఇకపై ఇండియాలో స్ట్రీమ్‌ అయ్యే డిజిటల్‌ కంటెంట్‌పై కూడా ఖచ్చితమైన సెన్సార్‌ నిబంధనలు విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

త్వరలోనే డిజిటల్‌ కంటెంట్‌ని నియంత్రించే కొత్త సెన్సార్‌ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. స్వీయ నియంత్రణ వుండాలని, ఇలాంటి కంటెంట్‌ సేల్‌ అవుతోందని బాధ్యతరహితంగా అలాంటివి సేల్‌ చేసుకోవాలని చూడకూడదని ఇప్పటికే సదరు సంస్థలకి హెచ్చరికలు వెళ్లినట్టు తెలిసింది. పిల్లలు వున్న ఇంట్లో పేరంటల్‌ కంట్రోల్స్‌ ద్వారా ఈ స్ట్రీమింగ్‌ యాప్స్‌లోని అడల్ట్‌ కంటెంట్‌ పిల్లల దృష్టిలో పడకుండా జాగ్రత్త పడవచ్చు. తల్లిదండ్రులు ఈ విషయంలో కాస్త శ్రద్ధ పెట్టి అలాంటివి పిల్లల కంట పడకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం వుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English