'బిగ్‌బాస్‌' నుంచి వితిక ఎలిమినేటెడ్‌

'బిగ్‌బాస్‌' నుంచి వితిక ఎలిమినేటెడ్‌

'బిగ్‌బాస్‌' సీజన్‌ 3కి జంటగా వెళ్లిన వరుణ్‌ సందేశ్‌, వితిక షేరు ఎట్టకేలకు పదమూడు వారాల తర్వాత విడిపోయారు. ఈ వారం హౌస్‌ నుంచి వితిక ఎలిమినేట్‌ అయింది. వితిక నామినేషన్లకి వెళితే ఎలిమినేట్‌ అవుతుందనేది వరుణ్‌కి అర్థమైపోయింది. అందుకే ఆమె ఎలిమినేషన్స్‌కి వెళ్లకుండా గత రెండు వారాలుగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆమెకి మెడాలియన్‌ దక్కేలా చేస్తే సరాసరి ఫైనల్స్‌కి వెళుతుందని భావించాడు కానీ బిగ్‌బాస్‌ ట్విస్ట్‌ ఇచ్చి ఒక్క వారం మాత్రమే సేవ్‌ అయ్యే అవకాశమిచ్చాడు.

అలా గత వారం నామినేషన్‌ తప్పించుకున్న వితికని ఈసారి శివజ్యోతి తెలివిగా నామినేషన్లలోకి లాగింది. ఆమె కనుక నామినేషన్లలో లేకుండా తాను వెళితే ఎలిమినేట్‌ అయిపోతాననేది శివజ్యోతికి కూడా తెలుసు. అందుకే వరుణ్‌ సందేశ్‌, వితికతో నామినేషన్‌ ప్రాసెస్‌లో గొడవ పడి మరీ వితికతో పాటు అందరినీ నామినేషన్లలోకి తెచ్చింది. హౌస్‌లోని వారు, బయటి వారు భావించినట్టుగానే అందరిలో వితికకే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి డబుల్‌ ఎలిమినేషన్‌ వుంటుందని అనుకున్నారు కానీ బిగ్‌బాస్‌ ఈ సీజన్‌లో డబుల్‌ ధమాకా లేకుండా చూసుకున్నాడు. వితిక ఎలిమినేట్‌ అవడంతో పాటు రాహుల్‌తో కూడా దూరం పెరిగిన నేపథ్యంలో ఇక మీదట వరుణ్‌ సందేశ్‌ ఎలా ఆడతాడనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English