వాళ్ల కథలు పట్టుకొచ్చి ఈ క్రియేటివిటీ ఏంటో?

వాళ్ల కథలు పట్టుకొచ్చి ఈ క్రియేటివిటీ ఏంటో?

బుల్లితెరపై యాంకర్‌గా, ప్రోగ్రామ్స్ ప్రొడ్యూసర్‌గా ఓంకార్ ఎంత సక్సెస్ అయినా.. అతడి మీద జనాల్లో విపరీతమైన నెగెటివిటీ ఉన్న మాట వాస్తవం. ‘ఆట’ సహా అతను చేసిన కొన్ని ప్రోగ్రామ్స్‌లో అతను పెంచి పోషించిన విపరీతమైన నాటకీయత చూసి జనాలు ఒక దశలో అతణ్ని అసహ్యించుకున్నారు. సోషల్ మీడియాలో ఓంకార్‌ను ఓ రేంజిలో ఆడుకున్నారు. ఈ నెగెటివిటీ ఇలా ఉండగానే ‘జీనియస్’ అనే సినిమా తీశాడతను. ఆ సినిమా మొదలైనపుడు, రిలీజ్ అయినపుడు మామూలుగా హడావుడి చేయలేదు. కానీ విషయం తక్కువ, హడావుడి ఎక్కువ అన్నట్లు వ్యవహారం తయారవడంతో ఆ సినిమా తుస్సుమనిపించింది. ఇలాంటి దశలో అసలేమాత్రం అంచనాలు లేకుండా ఓంకార్ నుంచి వచ్చిన హార్రర్ కామెడీ మూవీ ‘రాజు గారి గది’ మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. పెద్ద విజయం సాధించింది.

ఇక అంతే.. ఓంకార్ హార్రర్ కామెడీ చిత్రాల పితామహుడు లారెన్స్‌ను మరిపించేయాలనుకున్నాడు. లారెన్స్ తమిళంలో ‘కాంఛన’ సిరీస్ తీసినట్లే ‘రాజు గారి సిరీస్’ను ఒక ఫ్రాంచైజీగా మార్చేశాడు. ఈ సిరీస్‌లో ఇంకో రెండు సినిమాలు తీశాడు. ఐతే లారెన్స్‌ ‘కాంఛన’ సిరీస్‌లో ఎంత రొటీన్ కథలు ట్రై చేసినా, ఎంత ఊర మాస్ కామెడీ చేయించినా.. అవి అతడి ఒరిజినల్ ఆలోచనలతో తెరకెక్కినవే. సొంత కథలతోనే అతను సినిమాలు తీశాడు. కానీ ఓంకార్ క్రియేటివిటీ మాత్రం ‘రాజు గారి గది’ దగ్గరే ఆగిపోయింది. తర్వాత సొంత కథే ట్రై చేయలేదు.

మలయాళంలో ఒక సినిమాను పట్టుకొచ్చి ‘రాజు గారి గది-2’ తీశాడు. అది ఆడలేదు. ఇప్పుడు తమిళంలో వచ్చిన ‘దిల్లుకు దుడ్డు-2’ అనే హార్రర్ కామెడీ కథను తీసుకొచ్చి ‘రాజు గారి గది-3’ తీశాడు. పేరుకేమో తాను ఒక ఫ్రాంఛైజీ క్రియేట్ చేసి అందులో భాగంగా సినిమాలు తీస్తున్నట్లు ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఇవి రెండూ రీమేక్‌లు అనే విషయం కూడా గోప్యంగా ఉంచాడు. సినిమాల్లో రైటర్‌గా తన పేరే వేసుకున్నాడు. కానీ ఈ రోజుల్లో మీడియా, సోషల్ మీడియా ప్రపంచంలో ఏ మూల నుంచి సినిమా పట్టుకొచ్చినా ఇట్టే కనిపెట్టేస్తున్నాయి. ఓంకార్ సినిమాల గుట్టును కూడా అలాగే బయటపెట్టాక అతను ఔను ఇవి రీమేక్‌లే అని ఆలస్యంగా ఒప్పుకున్నాడు. మరి రీమేక్ కథలతో రొటీన్ సినిమాలు తీస్తూ.. ‘రాజు గారి గది’ సిరీస్‌లో పది సినిమాలు వస్తాయని బిల్డప్పులు ఇవ్వడమేంటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English