అక్కడ హృతిక్.. ఇక్కడ అఖిల్?

అక్కడ హృతిక్.. ఇక్కడ అఖిల్?

ఇండియాలో సూపర్ హీరో సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కథానాయకుడు హృతిక్. అతడి క్రిష్ సిరీస్ ఎంతగా పాపులర్ అయిందో.. ఎలా కాసుల వర్షం కురిపించిందో తెలిసిందే. గతంలోనూ ఇండియాలో కొన్ని సూపర్ హీరో సినిమాలు తెరకెక్కాయి కానీ.. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగా ఈ జానర్ సినిమాలతో మెరిసింది హృతికే. ఇప్పుడు దక్షిణాదిన తొలిసారిగా ‘క్రిష్’ తరహా సూపర్ హీరో ఫిలిం ఒకటి తెరకెెక్కుతోంది. ఆ సినిమా పేరు.. హీరో. తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా పి.ఎస్.మిత్రన్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. విశాల్ మూవీ ‘ఇరుంబు తిరై’ (తెలుగులో అభిమన్యుడు)తో మిత్రన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇటీవలే ‘హీరో’ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. క్రిష్ హీరో లాగే ముఖానికి మాస్క్ తొడుక్కుని కనిపిస్తున్నాాడు శివ ఇందులో.

‘హీరో’ చిత్రం తెలుగులో రీమేక్ కాబోతోందని.. అందులో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. ‘అఖిల్’ సినిమాతో హీరోగా పరిచయమై.. దాంతో పాటుగా మరో రెండు ఫ్లాపులు ఎదుర్కొన్న అఖిల్.. ప్రస్తుతం ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది భాస్కర్ స్టయిల్లో సాగే ప్రేమకథ అట. దీని తర్వాత యాక్షన్ మూవీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న అఖిల్.. మిత్రన్ దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పాడట. ఈ ప్రాజెక్టు ఎలా సెట్ అయింది అన్నది తెలియదు కానీ.. ‘హీరో’ ఔట్ పుట్ మీద కాన్ఫిడెంటుగా ఉన్న మిత్రన్.. తెలుగులో అఖిల్ హీరోగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడని సమాచారం. ఈ చిత్రాన్ని అఖిల్ తండ్రి నాగార్జునే నిర్మించే అవకాశాలున్నాయి. ‘హీరో’ తమిళంలో క్రిస్మస్ కానుకగా డిసెంబరు 20న విడుదల కానుంది. ఈ సినిమా ఫలితాన్ని బట్టి తెలుగు రీమేక్ ఖరారయ్యే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English