సూపర్ స్టార్ స్థానాన్ని ఆక్రమించేశాడుగా..

సూపర్ స్టార్ స్థానాన్ని ఆక్రమించేశాడుగా..

కొన్నేళ్ల ముందు వరకు తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్థానానికి దరిదాపుల్లో కూడా మిగతా హీరోలు ఉండేవాళ్లు. కోలీవుడ్లోనే కాదు.. దక్షిణాదిన  హీరోకు కూడా రజనీ స్థాయిలో మార్కెట్, ఫాలోయింగ్ ఉండేది కాదు. కానీ ఈ మధ్య ఆయన మార్కెట్ పడటం, వేరే హీరోల మార్కెట్ పెరగడం సమాంతరంగా జరిగింది. ముఖ్యంగా కోలీవుడ్లోనే ఒక హీరో ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోతూ రజనీని దాటిపోయాడు. అతనే.. అభిమానులు ప్రేమగా దళపతి అని పిలుచుకునే జోసెఫ్ విజయ్. ‘తుపాకి’, ‘జిల్లా’, ‘కత్తి’, ‘తెరి’, ‘మెర్శల్’ లాంటి బ్లాక్ బస్టర్లతో విజయ్ రేంజే మారిపోయింది. గత ఏడాది ‘సర్కార్’ సినిమాతో అంచనాలు అందుకోలేకపోయినప్పటికీ.. తన కొత్త సినిమా ‘బిగిల్’తో కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేయించగలిగాడు విజయ్.

దీపావళి కానుకగా విడుదల కానున్న ‘బిగిల్’ మీద మామూలుగా అంచనాలు లేవు. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.140 కోట్లకు అమ్ముడవడం విశేషం. శాటిలైట్, డిజిటల్, ఇతర హక్కులు కలిపితే ఈ సినిమా బిజినెస్ రూ.200 కోట్లు దాటిపోయింది. ఒక్క తమిళనాడు హక్కులే రూ.100 కోట్ల మార్కును దాటేయడం విశేషం. మన ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ కావడంతో అతడి మార్కెట్ స్థాయి పెరిగింది కానీ.. విజయ్ పక్కా లోకల్ సినిమాలతోనే తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోయాడు. అతనింకా పాన్ ఇండియా సినిమా ఏదీ చేయలేదు. కేరళలో అతడికి తమిళనాడుతో సమానంగా ఫాలోయింగ్ ఉంది. కర్ణాటకలోనూ మంచి మార్కెట్టే సంపాదించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనూ నెమ్మదిగా పాగా వేస్తున్నాడు. ఇలా నెమ్మదిగా మార్కెట్ పెంచుకుంటూ సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ హీరోల్లో ఒకడిగా అవతరిస్తున్నాడు విజయ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English