88 కిలోల బంగారం...409 కోట్ల న‌గ‌దు..ఇది కల్కి రేంజ్‌

88 కిలోల బంగారం...409 కోట్ల న‌గ‌దు..ఇది కల్కి రేంజ్‌

ఎల్ఐసీ క్ల‌ర్క్‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంద‌రో `భ‌క్తుల‌ను` క‌లిగి ఉన్న స్వ‌యం ప్ర‌క‌టిత స్వామీ క‌ల్కి భ‌గ‌వాన్ ఆస్తుల‌పై ఐటీ అధికారుల దాడుల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. కల్కిభగవాన్‌ దంపతులకు చెందిన ఆశ్రమాలు, వ్యాపార సంస్థలపై మూడోరోజైన శుక్ర‌వారం ఆదాయం పన్ను (ఐటీ) అధికారుల దాడులు కొనసాగాయి.

దక్షిణాది రాష్ట్రాలలో 40 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు. హైదరాబాద్‌లోని స్ట్టూడియో ఎన్‌ కార్యాలయంతోపాటు డబ్ల్యూఎల్‌ స్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఫిల్మ్‌నగర్‌లోని కల్కిభగవాన్‌ కుమారుడు కృష్ణకు చెందిన ఆస్తులతోపాటు, ఆయన వ్యాపార భాగస్వాములపై కూడా ఐటీ దాడులు జరిగాయి. అనంత‌రం ఐటీ అధికారులు త‌మ సోదాల‌కు సంబంధించి చెన్నైలో పత్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇందులో సంచ‌ల‌న అంశాలు ప్ర‌స్తావించారు.

చిత్తూరు జిల్లాకు కల్కి భగవాన్ అసలు పేరు విజయ్‌కుమార్‌నాయుడు. 1949 మార్చి 7న జన్మించిన ఆయన మొదట ఎల్‌ఐసీలో క్లర్క్‌గా పనిచేశారు. అనంతరం ఉద్యోగం వదిలేసి స్నేహితుడు శంకర్‌తో కలిసి 1984లో చిత్తూరులో స్థాపించిన జీవాశ్రం స్కూల్‌ను నష్టాలు రావడంతో మూసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయా రు. ఆ తర్వాత విష్ణుమూర్తి పదో అవతారం కల్కి భగవాన్‌గా చెప్పుకుంటూ 1989లో చిత్తూరులో ప్రత్యక్షమై తనతోపాటు తన భార్యను కూడా దైవాంశ సంభూతిరాలిగా పేర్కొన్నారు.

క్రమంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆశ్రమాలను విస్తరించారు. కల్కిభగవాన్‌ ఆశ్రమం ఐదెకరాల నుంచి ప్రారంభమై వేలాది ఎకరాలకు విస్తరించింది. ఆశ్రమంలో దాదాపు 1500 మందికిపైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి ఏటా సిబ్బందికి జీతభత్యాలు చెల్లిస్తూ క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తూ, ఐటీ రిటర్న్‌ దాఖలు చేస్తున్న కల్కిభగవాన్‌ గత మూడేళ్లుగా పన్నులు చెల్లించడం లేదని, ఐటీ రిటర్న్స్‌ కూడా దాఖలు చేయడం లేదని సమాచారం.

ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌రిగిన సోదాల్లో ఆయ‌న `లీల‌ల‌ను` ఐ.టి అధికారులు కొలిక్కి తెచ్చారు. 5 కోట్లు విలువచేసే వజ్రాలు, 26 కోట్లు విలువ చేసే 88 కేజీల బంగారం, 40.39 కోట్ల నగదుతో పాటు 18 కోట్ల విదేశీ కరెన్సీ, మొత్తం 93 కోట్ల విలువ చేసే బంగారు, నగదు స్వాధీనం చేసుకున్న‌ట్లు చెన్నైలో విడుద‌ల చేసిన పత్రికా ప్ర‌క‌ట‌నలో అధికారులు వెల్ల‌డించారు. ఇదిలాఉండ‌గా, మ‌రో 409 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీల రసీదులను ఐటీ అధికారులు అడుగుతున్నట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English