ఆడియో ఫంక్ష‌న్ల‌పై ర‌విబాబు మార్కు పంచ్

ఆడియో ఫంక్ష‌న్ల‌పై ర‌విబాబు మార్కు పంచ్

టాలీవుడ్లో ఆడియో ఫంక్ష‌న్లు, ప్రి రిలీజ్ ఈవెంట్లు ఎలా జ‌రుగుతాయో తెలిసిందే. ఒక‌రినొక‌రు పొగుడుకోవ‌డం, సుదీర్ఘ‌మైన‌ స్పీచ్‌లు దంచ‌డం.. యాంక‌ర్లు హ‌ద్దుల్లేని ఎలివేష‌న్లు ఇవ్వ‌డం.. ఇలా ఒక మూస‌లో సాగిపోతుంటాయి ఈ ఈవెంట్లు. అయితే యాక్ట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ ర‌విబాబు త‌న సినిమాలు వేటికీ ఇలాంటి ఈవెంట్లు చేయ‌డు. అత‌డి ప్ర‌మోష‌న్ల తీరే వేరుగా ఉంటుంది. అత‌ను త‌న సినిమాల వేడుక‌లు చేయ‌క‌పోవ‌డ‌మే కాదు.. ఏ వేడుకకూ వెళ్ల‌డు కూడా. ఎవ‌రైనా అడిగినా మొహం మీదే రాన‌ని చెబుతాడ‌ట‌. ఈ వేడుక‌లంటే ఎందుకంత వ్య‌తిరేక‌త అని ఓ ఇంట‌ర్వ్యూలో అడిగితే మొహమాట‌ప‌డ‌కుండా అస‌లు విష‌యం చెప్పాడు.


‘‘ఆడియో ఫంక్ష‌న్లు, ప్రి రిలీజ్ ఈవెంట్లు చాలా బోర్. నేను వాటిలో కూర్చోలేను. యాంక‌ర్లు వ‌చ్చి పిచ్చి జోకులు వేస్తారు. పొగుడుతారు. నాకు న‌వ్వు రాదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైగా ఆ వేడుక‌ల్లో విప‌రీత‌మైన సౌండ్. మొత్తంగా ఇలాంటి కార్య‌క్ర‌మాలు నాకు చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. అందుకే వెళ్ల‌ను’’ అని ర‌విబాబు చెప్పాడు. మ‌రోవైపు బాల‌కృష్ణ త‌న‌ను త‌ర‌చుగా.. త‌న‌తో సినిమా చేయ‌మ‌ని అడుగుతుంటాడ‌ని.. ఆయ‌న‌తో త‌న‌కు మంచి అనుబంధం ఉంద‌ని ర‌విబాబు చెప్ప‌డం విశేషం. ఆయ‌న సినిమాను డైరెక్ట్ చేయ‌డం త‌న‌కు గౌర‌వం అని.. కాక‌పోతే స్టార్ల‌ను దృష్టిలో ఉంచుకుని క‌థ‌లు రాయ‌డం త‌న‌కు అల‌వాటు లేద‌ని.. క‌థ‌కు త‌గ్గ న‌టీన‌టుల్నే ఎంచుకుంటాన‌ని చెప్పాడు ర‌విబాబు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English