పోరాడి పోరాడి సాధించాడు

పోరాడి పోరాడి సాధించాడు

విజ‌య్ త‌మిళంలో పెద్ద స్టార్. కానీ అత‌డి ముందు చిన్న స్థాయి అన‌ద‌గ్గ చాలామంది హీరోలు తెలుగులో ఎప్పుడో క్రేజ్ సంపాదించారు. మార్కెట్ పెంచుకున్నారు. కానీ విజ‌య్ మాత్రం ఇక్క‌డ గుర్తింపు సంపాదించ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. ఒక‌ప్పుడు అత‌డి సినిమాలు ఇక్క‌డ రిలీజ్ కావ‌డ‌మే గ‌గ‌నంగా ఉండేది. రిలైజైనా మ‌న జ‌నం ప‌ట్టించుకునేవాళ్లు కాదు. ఐతే గ‌త కొన్నేళ్ల‌లో ప‌రిస్థితి మారింది.

స్నేహితుడు, తుపాకి, జిల్లా, అదిరింది, స‌ర్కార్ లాంటి సినిమాల‌తో నెమ్మ‌దిగా తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ సంపాదించ‌గ‌లిగాడు విజ‌య్. గ‌త ఏడాది స‌ర్కార్ సినిమా డివైడ్ టాక్‌తోనూ మంచి వ‌సూళ్లు సాధించింది. ఇక్కడ రిలీజ్ చేసిన నిర్మాత‌కు లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు విజ‌య్ కొత్త సినిమా విజిల్‌కు ఇంకా మంచి క్రేజ్ వ‌చ్చింది.

విజ‌య్ సినిమాల హ‌క్కులు ఒక‌ప్పుడు కోటి రెండు కోట్లు ప‌లికేవి. అదిరింది సినిమాకు రూ.5.5 కోట్ల దాకా రేటు ప‌లికింది. స‌ర్కార్‌కు 7 కోట్ల దాకా వ‌ర్క‌వుట్ అయింది. ఇప్పుడు విజిల్ గ‌త రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లు కొట్టేసింది. విజ‌య్ కెరీర్లో తొలిసారిగా డ‌బుల్ డిజిట్ ఫిగ‌ర్‌కు రేటు పెర‌గ‌డం విశేషం. విజిల్‌కు తెలుగు రాష్ట్రాల్లో రూ.10.6 కోట్ల బిజినెస్ జ‌ర‌గ‌డం విశేషం. ఇది విజ‌య్ కెరీర్ బెస్ట్ అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

దీపావ‌ళికి తెలుగు సినిమాలేవీ షెడ్యూల్ కాక‌పోవ‌డం, విజిల్‌కు మ‌న ద‌గ్గ‌రా మంచి క్రేజ్ ఉండ‌టంతో భారీగానే సినిమాను రిలీజ్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని పీఆర్వో ట‌ర్న్డ్ ప్రొడ్యూస‌ర్ మ‌హేష్ కోనేరు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాడు. అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English