అతడితో తమన్నా డ్యూయెట్టా.. బాబోయ్

అతడితో తమన్నా డ్యూయెట్టా.. బాబోయ్

‘రాజు గారి గది-3’ సినిమాలో కథానాయిక పాత్ర చేయడానికి తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ ఒప్పుకోవడం ఎంత ఆశ్చర్యం కలిగించిందో.. ఒప్పుకున్న కొన్ని రోజులకే ఈ చిత్రం నుంచి తప్పుకోవడం కూడా అంతే ఆశ్చర్యపరిచింది.

కథతో పాటు తన పాత్రను మార్చాలని తమన్నా అడగడం, అందుకు తాను ఒప్పుకోకపోవడం వల్లే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా చెప్పాడు ఓంకార్. తమన్నా స్థానంలోకి అవికా గోర్ వచ్చింది. ఈ రోజు ‘రాజు గారి గది-3’ సినిమా థియేటర్లలోకి దిగిన నేపథ్యంలో అవికా పాత్రను చూసి జనాలు షాకవుతున్నారు.

సినిమాలో ఆమె పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. మంచి పెర్ఫామర్ అయిన ఆమెకు ఒక్క సీన్లో కూడా తన టాలెంట్ చూపించే అవకాశం రాలేదు. మొత్తం సినిమానంతా తన తమ్ముడు అశ్విన్, కమెడియన్ల చుట్టూనే తిప్పాడు ఓంకార్.

అవికా స్థాయికే అసలేమాత్రం తగని పాత్ర అంటే.. ఇందులో తమన్నా నటించి ఉంటే అంతే సంగతులు. అన్నిటికీ మించి ఇందులో అవికాది అశ్విన్‌కు జోడీగా కనిపించే పాత్రే. తమన్నా ఈ సినిమాలో చేస్తోందంటే అశ్విన్‌కు జోడీ అయి ఉండదని.. ఇద్దరూ ఒకరితో ఒకరికి సంబంధం లేని పాత్రలు చేస్తుంటారని అనుకున్నారంతా.

ఎందుకంటే తమన్నా లాంటి స్టార్ హీరోయిన్.. అశ్విన్‌కు జోడీ అంటే జనాలు జీర్ణించుకోలేరు. కానీ సినిమాలో అవికా అతడికి జోడీగానే నటించిన నేపథ్యంలో ఆ స్థానంలో తమన్నాను ఊహించుకోవడానికే ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఇందులో హీరో హీరోయిన్ల మీద ఒక యుగళ గీతం కూడా ఉంది.

తమన్నా వెంట పడుతూ అశ్విన్ డ్యూయెట్ పాడితే ఇంకేమైనా ఉందా? ముందు లైన్ తెలుసుకుని సినిమా చేయడానికి ఓకే అన్న తమన్నా.. పూర్తి నరేషన్ ఇచ్చాక మార్పులు చెప్పిందట. బహుశా తనకు, అశ్విన్‌కు జోడీ ఏంటి.. డ్యూయెట్లేంటి అని మిల్కీ బ్యూటీ అడిగి ఉంటే ఆశ్చర్యం లేదు. కాబట్టి ఈ సినిమా నుంచి ఆమె వైదొలగడం కూడా అర్థం చేసుకోదగ్గ విషయమే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English