బాలయ్య వెర్సస్ రవితేజ.. ఈసారి లేదా?

బాలయ్య వెర్సస్ రవితేజ.. ఈసారి లేదా?

నందమూరి బాలకృష్ణకు, రవితేజకు మధ్య ఏదో వ్యక్తిగత గొడవ జరిగిందనే ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. ఓ హీరోయిన్ విషయంలో వీళ్లకు గొడవ జరిగిందని అప్పట్లో రూమర్లు హల్ చల్ చేశాయి. అదెంత వరకు నిజమో కానీ.. ఈ ప్రచారం నేపథ్యంలో ఇద్దరి మధ్య బాక్సాఫీస్ వార్ జరిగినపుడు అందరూ ప్రత్యేక ఆసక్తి కనబరిచారు.

గతంలో బాలయ్య, రవితేజ రెండుసార్లు బాక్సాఫీస్ దగ్గర తలపడగా.. ఆ రెండుసార్లూ మాస్ రాజానే పైచేయి సాధించడం విశేషం. 2008 సంక్రాంతికి ‘ఒక్క మగాడు’, ‘కృష్ణ’ రిలీజ్ కాగా.. బాలయ్య సినిమా డిజాస్టర్ అయింది. రవితేజ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 2011 సంక్రాంతి బరిలో నిలిచారు వీళ్లిద్దరూ. అప్పుడు బాలయ్య సినిమా ‘పరమ వీర చక్ర’ అట్టర్ ఫ్లాప్ అయితే.. ‘మిరపకాయ్’ బాగా ఆడింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఎప్పుడూ పోటీ పడలేదు.

ఐతే ఈ ఏడాది క్రిస్మస్ పండక్కి బాక్సాఫీస్ దగ్గర బాలయ్య-రవితేజ పోటీ పడతారని ప్రచారం జరిగింది. మాస్ రాజా సినిమా ‘డిస్కో రాజా’ను క్రిస్మస్‌కే రిలీజ్ చేస్తున్నట్లు ఇంతకుముందు ప్రకటించారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న కొత్త చిత్రాన్ని ముందు సంక్రాంతికి అనుకున్నా.. తర్వాత వెనక్కి తీసుకొచ్చి క్రిస్మస్ రేసులో నిలిపారు.

దీంతో ఈ మాస్ హీరోల పోరు పక్కా అనుకున్నారు. కానీ లేటుగా రావాల్సిన బాలయ్య ముందుకు వస్తే.. క్రిస్మస్‌కే రావాల్సిన మాస్ రాజా రేసు నుంచి తప్పుకుని ఫిబ్రవరికి వెళ్లిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పాటుగా నితిన్ మూవీ ‘భీష్మ’ను కూడా ఇదే తరహాలో వాయిదా వేశారట. క్రిస్మస్‌కు సాయిధరమ్ తేజ్ మూవీ ‘ప్రతి రోజూ పండగే’తో బాలయ్య చిత్రం పోటీ పడుతుందన్నది తాజా సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English