త్రిష కెరీర్లో ట్విస్టులే ట్విస్టులు

త్రిష కెరీర్లో ట్విస్టులే ట్విస్టులు

ఒకప్పుడు తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు హవా సాగించింది త్రిష. సిమ్రాన్ తర్వాత సౌత్‌లో నంబర్ వన్ కిరీటం ఆమెనే వరించింది. కానీ దీన్ని ఎంతో కాలం తన దగ్గర పెట్టుకోలేకపోయిందామె. త్వరగా ఫేడవుట్ అయిపోయిన త్రిషకు ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు.

కాజల్, తమన్నా, సమంత లాంటి తర్వాతి తరం హీరోయిన్ల నుంచి ఆమె పోటీని తట్టుకోలేకపోయింది. అప్పటి ఆమె డౌన్ ఫాల్ చూస్తే ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యేలా కనిపించింది. అదే సమయంలో పెళ్లికి రెడీ అవడంతో ఇక ఆమె కెరీర్ ముగిసినట్లే అనుకున్నారు. కానీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని సినిమాల్లో కొనసాగడానికే నిర్ణయించుకున్న త్రిష.. మళ్లీ అవకాశాలు అందుకుంది.

గత ఏడాది ‘96’ సినిమాతో భలేగా బౌన్స్ బ్యాక్ అయిన త్రిష.. ఇప్పుడు పెద్ద అవకాశాల దిశగా అడుగులేస్తుండటం విశేషమే. ఓవైపు తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకున్న త్రిష.. మరోవైపు మలయాళంలో మోహన్ లాల్‌కు జంటగా ఓ సినిమాలో నటిస్తోంది. ఇదే సమయంలో తెలుగు నుంచి ఆమెకు ఓ పెద్ద అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో త్రిషను ఓ కథానాయికగా ఎంచుకున్నారట. ఇదే నిజమైతే ‘స్టాలిన్’ తర్వాత చిరుతో త్రిష జోడీ కట్టబోయే సినిమా ఇదే అవుతుంది. అప్పుడు కెరీర్ పీక్స్‌లో ఉండగా చిరు పక్కన నటించడం పెద్ద విషయం కాదు.

కానీ ఇప్పుడు కెరీర్ ముగిసే దశలో చిరుతో జోడీ కట్టడమే ఆశ్చర్యం. 35వ పడికి చేరువ అవుతూ.. మూడు భాషల్లో భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకోవడం త్రిష కెరీర్లో మామూలు ట్విస్టు కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English