మంచు మనోజ్ పాత ట్వీట్.. వైరల్

 మంచు మనోజ్ పాత ట్వీట్.. వైరల్

మంచు మనోజ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాన్నాళ్లుగా నడుస్తున్న సస్పెన్స్ వీడిపోయింది. తన భార్య ప్రణతి నుంచి తాను విడాకులు తీసుకుంటున్నట్లుగా వెల్లడించి పెద్ద షాకిచ్చాడు మనోజ్. నిజానికి మంచు వారి చిన్నబ్బాయి తీరు రెండేళ్లుగా అనేక అనుమానాలకు తావిస్తూనే ఉంది.

రెండేళ్ల కిందట ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాతో పలకరించిన మనోజ్.. ఆ తర్వాత సినిమానే చేయలేదు. కనీసం కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయనూ లేదు. ఈ రెండేళ్లలో తన భార్య ప్రణతితో కలిసి ఎప్పుడూ కనిపించకపోవడంతో జనాలకు సందేహాలు కలిగాయి. పండుగలప్పుడు కుటుంబ సభ్యులతో ఫొటోలు దిగినపుడు కూడా అతడి పక్కన భార్య లేదు. దీంతో మనోజ్‌కు, ప్రణతికి మధ్య సఖ్యత లేదనే ప్రచారం జరిగింది.

తన భార్య నుంచి మనోజ్ విడాకులు తీసుకుంటున్నట్లుగా గత ఏడాదే గట్టిగా ప్రచారం జరిగింది. దీని మీద మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే యూట్యూబ్‌లో మనోజ్ విడాకుల గురించి ఒక స్టోరీ హల్ చల్ చేయగా.. దీని గురించి మనోజ్ అభిమాని ఒకరు ట్విట్టర్లో ప్రస్తావించారు. మనోజ్‌ను ట్యాగ్ చేస్తూ క్లారిటీ ఇవ్వమన్నాడు.
దానికి బదులుగా ‘వాళ్ల బొంద’ అని బదులిచ్చాడు మనోజ్. దీనిపై మరింత వివరణ ఇస్తూ విడాకుల వార్తను ఖండించాడు. తన జీవితాంతం ప్రణతిని ప్రేమిస్తుంటానని.. ఆమె ఎప్పుడూ తన గుండెల్లో ఉంటుందని వివరించాడు. అలా అన్న మనోజ్ ఇప్పుడు సందేహాల్ని నిజం చేస్తూ విడాకుల విషయాన్ని ధ్రువీకరించడంతో పాత ట్వీట్లను తవ్వుతున్నారు జనాలు.

ముఖ్యంగా వాళ్ల బొంద అని మనోజ్ అన్న ట్వీట్‌ను చాలామంది రీట్వీట్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఐతే వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద కుదుపును ఎదుర్కొంటున్న మనోజ్‌ను ఈ సమయంలో ఇలా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు గ్రహిస్తే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English