సాహో నిర్మాతలపై కేసు బుక్ చేసిన బ్యాగ్ కంపెనీ

సాహో నిర్మాతలపై కేసు బుక్ చేసిన బ్యాగ్ కంపెనీ

టాలీవుడ్ లోనే కాదు.. దేశంలోని అన్ని వుడ్డుల్లోనూ హాట్ టాపిక్ గా మారి.. ఈ మధ్యనే విడుదలైన సాహో గురించి తెలిసిందే. ఇప్పటివరకూ ఈ సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుకున్న దానికి బదులుగా ఇప్పుడు మరో విషయంతో ఈ సినిమా వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఒక బ్యాగ్ కంపెనీతో సాహో నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారని.. కానీ అందుకు భిన్నంగా సాహో సినిమా ఉందంటున్నారు.

తాజాగా హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో సాహో నిర్మాతలపై ఔట్ షైనీ బ్యాగుల కంపెనీ తమను మోసం చేశారంటూ ఫిర్యాదు చేశారు. సాహోను నిర్మించిన యూవీ క్రియేషన్స్ పైన వారు కేసు బుక్ చేశారు. యూవీ క్రియేషన్స్ నిర్మాతలైన వంశీ.. ప్రమోద్.. భూషన్ లతో తమ కంపెనీ ఒప్పందం చేసుకుందన్నారు. దీని ప్రకారం సినిమాలో తమ బ్యాగుల్నిహీరో.. హీరోయిన్ల చేత వాడేలా చేస్తామంటూ తమ వద్ద నుంచి రూ.1.38 కోట్లు తీసుకున్నట్లుగా చెప్పారు.

అయితే.. సినిమాలో తమ కంపెనీ బ్యాగుల్ని వాడకపోగా.. ఎలాంటి ప్రచారం చేయకుండా మోసగించినట్లుగా పేర్కొన్నారు. దీనిపై తాజాగా సంస్థ ప్రతినిధి రాయదుర్గం పోలీసుల్ని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ అంశంపై దర్యాప్తు చేయనున్నారు. అయినా.. ఇలా చేయటమేమిటి సాహో?


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English