సత్య నాదెళ్ల జీతం అంత ఎందుకు పెరిగిందంటే?

సత్య నాదెళ్ల జీతం అంత ఎందుకు పెరిగిందంటే?

తెలుగోడి కీర్తి పతాకాన్ని ఎగురవేసిన వారిలో నేటి తరానికి ఐకాన్ లుగా మిగిలిపోతారు సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కు సీఈవోగా వ్యవహరిస్తున్న తెలుగోడు సత్య నాదెళ్ల. తాజాగా ఆయన అందుకునే జీతానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో సత్య నాదెళ్లకు రూ.305 కోట్ల ప్యాకేజీని అందుకున్నారు. 42.9 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ఇచ్చిన మైక్రోసాఫ్ట్ అంతకు ముందు ఏడాది కంటే దాదాపు 66 శాతం అధికంగా ఇవ్వటం గమనార్హం.

ఐదేళ్ల క్రితం (2014) మైక్రోసాఫ్ట్ సీఈవో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్లేలా చేయటంలో సత్య నాదెళ్ల కృషి ఎంతో ఉందని.. కంపెనీలో ఆయన తీసుకొచ్చిన మార్పులు.. కొత్త టెక్నాలజీలు.. మార్కెట్ ను మరింత విస్తరించేందుకు వీలు కలిగినట్లు మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.

గత ఏడాది కంపెనీ చక్కటి ఆర్థిక ఫలితాల్ని సాధించటంలో సత్య నాదెళ్ల పాత్ర చాలా కీలకంగా కంపెనీ భావిస్తోంది. ఈ కారణంతోనే ఆయనకు అత్యధిక జీతాన్ని కంపెనీ అందించింది. 2017-18 సంవత్సరానికి 25.8 మిలియన్ డాలర్ల ప్యాకేజీని అందుకోగా.. గత ఏడాది ఏకంగా 42.9 మిలియన్ డాలర్లు.. ఈ ఏడాది అంతకు మించిన ప్యాకేజీ ఆయనకు అందనున్నట్లు చెబుతున్నారు. కంపెనీకి వేలాది కోట్ల ఆదాయానికి కారణమైన సీఈవోకు వందల కోట్ల ప్యాకేజీ అందటంలో అర్థముందని చెప్పక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English