చిరు 152.. టైటిల్ ర‌చ్చ షురూ

చిరు 152.. టైటిల్ ర‌చ్చ షురూ

సైరా న‌ర‌సింహారెడ్డి క‌థ కంచికి చేరింది. ఇక చిరంజీవి త‌ర్వాతి సినిమా మీదికి అంద‌రి దృష్టి మ‌ళ్లుతోంది. రాజ‌మౌళి త‌ర్వాత అదే స్థాయిలో 100 ప‌ర్సంట్ స‌క్సెస్ రేట్‌తో సాగిపోతున్న అగ్ర ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ డైరెక్ష‌న్లో చిరు త‌న త‌ర్వాతి సినిమాను చేస్తుండ‌టంతో దీనిపై అంచ‌నాలు ఇప్ప‌టికే భారీ స్థాయిలో ఉన్నాయి. అయితే ఇంకా షూటింగ్ కూడా ఆరంభం కాకుండానే ఈ సినిమా గురించి ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల ఊహాగానాలు వస్తున్నాయి.

ఇందులో చిరు ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ని.. చిరు ఐటీ అధికారి పాత్ర చేస్తున్నాడ‌ని.. ఆల‌యాల నేప‌థ్యంలో సాగే క‌థ ఇద‌ని ఒక ప్ర‌చారం న‌డుస్తుంటే.. చిరు న‌క్స‌లైట్ పాత్ర చేస్తున్నాడ‌ని.. సామాజిక అంశాల నేప‌థ్యంలో సీరియ‌స్‌గా సాగే క‌థ ఇద‌ని ఇంకో ర‌క‌మైన ఊహాగానాలు కూడా న‌డుస్తున్నాయి. ఇందులో ఏది నిజ‌మో తెలియ‌డం లేదు.

ఇదిలా ఉంటే చిరు కొత్త చిత్రానికి గోవింద ఆచార్య అనే వ‌ర్కింగ్ టైటిల్ పెట్టుకుని షూటింగ్‌కు వెళ్తున్న‌ట్లుగా ఒక రూమ‌ర్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దీంతో అభిమానులు ఊరుకుంటారా? చిరు పాత్ర మీద ఉన్న అంచ‌నా, ఈ టైటిల్ జోడించి ఒక అభిమాని త‌న క్రియేటివిటీతో ఒక పోస్ట‌ర్ రెడీ చేశాడు. చిరుకు న‌క్స‌ల్ డ్రెస్ వేసి.. చేతిలో తుపాకి పెట్టి.. బ్యాగ్రౌండ్లో ఎర్ర జెండాలతో ఒక పోస్ట‌ర్ రెడీ చేశాడు.

గోవింద ఆచార్య అనే టైటిల్ కూడా పెట్టేశాడు. ఇది ఒరిజ‌న‌లే అనిపించే స్థాయిలో ఈ పోస్ట‌ర్ త‌యారైంది. ఇదిప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇదేంటి చ‌డీచ‌ప్పుడు లేకుండా టైటిల్, ఫ‌స్ట్ లుక్ రెడీ అయిపోయింద‌ని మెగా అభిమానులు ఆశ్చ‌ర్య‌పోయే స్థాయిలో ఉందా పోస్ట‌ర్. చిరు పాత్ర సంగ‌తి వ‌దిలేస్తే.. ఇంత‌కీ ఈ చిత్రానికి గోవింద ఆచార్య అనే టైటిల్ పెట్టిన‌ట్లు న‌డుస్తున్న ప్రచారం ఎంత వ‌ర‌కు నిజ‌మో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English