విజయ్ మీద అక్కసుతో అజిత్ అభిమానులేం చేశారంటే..

విజయ్ మీద అక్కసుతో అజిత్ అభిమానులేం చేశారంటే..

ఇండియాలో సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ బాగా ఊపందుకునేలా చేసిన ఘనత తమిళ స్టార్లు విజయ్, అజిత్‌ల అభిమానులకే చెందుతుంది. తమ హీరో సినిమా టీజరో, ట్రైలరో వస్తోందంటే.. పదుల సంఖ్యలో ఒక గదిలో కంప్యూటర్లు పెట్టుుకుని వేర్వేరు అకౌంట్ల నుంచి లైక్స్ కొట్టడం, వ్యూస్ పెంచడం.. గంటకు ఇన్ని, రోజుకు ఇన్ని అని వ్యూస్, లైక్స్ టార్గెట్ పెట్టుకుని వాటిని పూర్తి చేయడం.. యూట్యూబ్‌లో అవతలి హీరో రికార్డును కొట్టడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించడం వీళ్ల నుంచే మొదలైంది.

కలెక్షన్లను చెప్పుకున్నట్లే యూట్యూబ్ వ్యూస్, లైక్స్‌ను కూడా రికార్డులుగా చెప్పుకునే దుస్సంప్రదాయాన్ని మొదలు పెట్టింది వీళ్లే. దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలకు కూడా లేని యూట్యూబ్ రికార్డులు విజయ్, అజిత్ సినిమాలకు ఉండటానికి ఈ ప్రత్యేక ప్రణాళికలే కారణం.

యూట్యూబ్‌ వ్యూస్, లైక్స్ విషయంలో ఈ దురభిమానుల అతి ఎంత వరకు చేరిందో చెప్పడానికి ఇప్పుడో తాజా ఉదాహరణ దొరికింది. అభిమానం వెర్రితలలు వేస్తే.. అవతలి హీరో మీద ద్వేషం తీవ్ర స్థాయికి చేరితే ఏమవుతుందో అజిత్ అభిమానులు రుజువు చేశారు. తాజాగా విజయ్ సినిమా ‘బిగిల్’ ట్రైలర్ రిలీజైంది. ఎప్పట్లాగే విజయ్ అభిమానులు పంతం పట్టి యూట్యూబ్ రికార్డుల అంతు చూసే పనిలో పడ్డారు.

దీంతో ఈ ట్రైలర్‌ లైక్స్ ఏకంగా 2 మిలియన్ మార్కు దిశగా పరుగులు పెట్టాయి. ఒకప్పుడు లక్ష లైక్స్ వస్తేనే గొప్ప అంటే.. ఏకంగా 20 లక్షల లైక్స్ అంటే మాటలా? ఐతే 2 మిలియన్ లైక్స్ సాధించిన తొలి ట్రైలర్‌ రికార్డు విజయ్ సినిమాకు దక్కబోతోందనే వార్తను అజిత్ అభిమానులు తట్టుకోలేకపోయారు. దీంతో 1.9 మిలియన్ లైక్స్‌తో ఇప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న షారుఖ్ సినిమా ‘జీరో’ ట్రైలర్ మీద పడ్డారు. దానికి లైక్స్ పెంచే పనిలో పడ్డారు.

1.9 మిలియన్ దగ్గర ఆగిపోయిన దాని లైక్స్.. కొన్ని గంటల్లో 2 మిలియన్ మార్కును టచ్ చేశాయి. దీంతో ఇండియాలో 2 మిలియన్ లైక్స్ మార్కును టచ్ చేసిన తొలి ట్రైలర్‌గా అదే రికార్డుల్లోకెక్కింది. ‘బిగిల్’ కూడా 2 మిలియన్ మార్కును అందుకుంది కానీ.. దానికి ‘ఫస్ట్’ రికార్డు దక్కలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English