కీర్తి సురేషా మజాకా

కీర్తి సురేషా మజాకా

‘మహానటి’లో సావిత్రి పాత్రకు కీర్తి సురేష్‌ను కథానాయికగా ఎంచుకున్నపుడు చాలామంది పెదవి విరిచారు. అప్పటికి ఆమె నటిగా రుజువు చేసుకున్నదేమీ లేదు. ఏ నిత్యా మీనన్ లాంటి వాళ్లనో కాకుండా సావిత్రి పాత్రకు కీర్తిని ఎందుకు తీసుకున్నారంటూ అభ్యంతరం చేసిన వాళ్లే ఎక్కువ. ఈ సినిమాపై విడుదలకు ముందు పెద్దగా అంచనాలు కలగకపోవడానికి కూడా కీర్తినే కారణం అని చెప్పొచ్చు. కానీ సినిమా చూశాక అందరి మతులు పోయాయి. ఈమెలో ఇంత గొప్ప నటి ఉందా అనిపించేలా అద్భుత అభినయంతో కట్టి పడేసింది. ఆ అభినయానికి నేషనల్ అవార్డ్స్ జ్యూరీ కూడా ఫిదా అయిపోయి ఆమెను గత ఏడాదికి జాతీయ ఉత్తమ నటిగా ఎంపిక చేసింది. అయితే ‘మహానటి’ తర్వాత కీర్తి స్థాయి, తనపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయిన నేపథ్యంలో అందుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ సందేహాలకు తగ్గట్లే ‘మహానటి’ రిలీజ్ తర్వాత కీర్తి కెరీర్లో ఒక స్లంప్ నడిచింది. కానీ అది కొంత కాలమే. కొంచెం గ్యాప్ తర్వాత కీర్తి భలేగా బౌన్స్ అయ్యింది. వేరే హీరోయిన్లు అసూయ చెందేలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు లైన్లో పెట్టింది. దక్షిణాదిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే నయనతార, అనుష్కలే చేయాలనిపించేది. కానీ కీర్తి వాళ్లకు దీటుగా సినిమాలు లైన్లో పెట్టడం విశేషం. కీర్తి కథానాయికగా నరేంద్ర అనే కొత్త దర్శకుడు తెలుగు, తమిళ భాషల్లో ‘మిస్ ఇండియా’ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కిందటే విడుదలైన దీని టీజర్ ఆకట్టుకుంది. కీర్తి కెరీర్లో ఇదో ప్రత్యేకమైన సినిమా అయ్యేలా కనిపించింది. ఇక ఈ రోజు కీర్తి పుట్టిన రోజు ఒకటికి రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల పోస్టర్లు రిలీజ్ చేశారు.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ రూపొందిస్తున్న సినిమాలో బంజారా యువతిగా కీర్తి లుక్ భలేగా అనిపిస్తోంది. దిల్ రాజు ప్రెజెంట్ చేస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం విశేషం. మరోవైపు తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణంలో ఈశ్వర్ కార్తీక్ అనే కొత్త దర్శకుడితో కీర్తి చేస్తున్న చిత్రానికి ‘పెంగ్లిన్’ అనే టైటిిల్ ఖరారు చేసి ప్రి లుక్ ఈ రోజే లాంచ్ చేశారు. అందులో కీర్తి గర్భవతిగా నటిస్తున్నట్లుంది షాడో లుక్ చూస్తే. మొత్తానికి ఒకే సమయంలో మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం, అవి వేటికవే భిన్నంగా ఉండటంతో కీర్తి సురేష్ రాబోయే రోజుల్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English