ఆ సినిమా నుంచి రాజశేఖర్ ఔట్

ఆ సినిమా నుంచి రాజశేఖర్ ఔట్

‘గరుడవేగ’ సినిమాతో చాలా ఏళ్ల తర్వాత మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ దీని తర్వాత చేసిన ‘కల్కి’కి మంచి హైప్ వచ్చినా.. దాన్ని నిలబెట్టుకునే స్థాయిలో సినిమా లేకపోయింది. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో మళ్లీ రాజశేఖర్ కెరీర్ ఇబ్బందికర స్థితికి చేరుకుంది. ఇలాంటి సమయంలో కొంచెం గ్యాప్ తీసుకుని, బాగా ఆలోచించి కన్నడలో విజయవంతమైన ‘కవుల్దారి’ అనే సినిమా తెలుగు రీమేక్‌లో నటించడానికి ఓకే చెప్పాడు రాజశేఖర్. ఇంతకుముందు విజయ్ ఆంటోనీ హీరోగా ‘బేతాళుడు’ సినిమా తీసిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకుడిగా ఫిక్సయ్యాడు. ధనుంజయన్ అనే తమిళ నిర్మాత, క్రిటిక్ ఈ చిత్రాన్ని నిర్మించాల్సింది. కొన్ని రోజుల కిందటే ఈ సినిమా అనౌన్స్ చేస్తూ మీడియా ముందుకు కూడా వచ్చారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి రాజశేఖర్ తప్పుకున్నాడట.

కారణాలేంటో తెలియడం లేదు కానీ.. ఈ సినిమాలో రాజశేఖర్ నటించడం లేదన్నది మాత్రం పక్కా అంటున్నారు. ఆయన స్థానంలో నాగార్జున మేనల్లుడు సుమంత్‌ను తీసుకున్నారని అంటున్నారు. రీఎంట్రీలో వరుసగా థ్రిల్లర్లే చేసిన రాజశేఖర్.. ‘కవుల్దారి’ కూడా థ్రిల్లరే కావడంతో దానికి ఓకే చెప్పాడు. కానీ దాన్నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడాయన ఏ సినిమా చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.

'గరుడవేగ-2' గురించి ఇంతకుముందు చర్చ జరిగినా మళ్లీ అంత బడ్జెట్ పెట్టి రాజశేఖర్‌తో దాని సీక్వెల్ తీసే సాహసం ఇప్పుడెవరూ చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ‘భాయ్’ సినిమాతో అడ్రస్ లేకుండా పోయిన వీరభద్రం చౌదరితో ఓ సినిమా చేయడానికి రాజశేఖర్ రెడీ అవుతున్నాడని.. వీళ్ల మధ్య కథా చర్చలు నడుస్తున్నాయని.. స్క్రిప్టు ఓకే అయితే స్వీయ నిర్మాణంలో రాజశేఖర్ ఈ సినిమా చేసే అవకాశముందని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English