కృష్ణ‌వంశీ ఈజ్ బ్యాక్.. టైటిలేంటంటే?

కృష్ణ‌వంశీ ఈజ్ బ్యాక్.. టైటిలేంటంటే?

మొత్తానికి క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ రీఎంట్రీ మూవీ విష‌యంలో స‌స్పెన్స్ వీడింది. మూడేళ్ల విరామం త‌ర్వాత ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమాను అధికారికంగా ప్ర‌క‌టించారు. ఆ సినిమాకు టైటిల్ కూడా ఖ‌రారైంది.

రంగ‌మార్తాండ అనే టైటిల్ పెట్టారీ చిత్రానికి. అనుకున్న‌ట్లే ఇది మ‌రాఠీ సినిమా న‌ట‌సామ్రాట్‌కు అఫీషియ‌ల్ రీమేక్‌. ఒక సినిమాను రీమేక్ చేస్తుంటే దాన్ని దాచిపెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటారు చాలామంది. కానీ పోస్ట‌ర్ మీదే న‌ట సామ్రాట్‌కు ఇది అఫీషియ‌ల్ రీమేక్ అనే విష‌యాన్ని ప్ర‌క‌టించ‌డం విశేషం.

ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడ‌ని.. ఆయ‌న‌కు జోడీగా ర‌మ్య‌కృష్ణ న‌టిస్తోంద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారం కూడా నిజ‌మే అని తేలింది. వాళ్ల పేర్లూ పోస్ట‌ర్ మీద ప‌డ్డాయి. దీని కంటే ముందు  24 ఏళ్ల కెరీర్లో కృష్ణ‌వంశీ ఒకే ఒక్క రీమేక్ తీశాడు. అదే.. చంద్ర‌లేఖ‌. మ‌ళ్లీ ఇంత కాలానికి ఆయ‌న మ‌రో భాషా చిత్రాన్ని తెలుగులో తీస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ జావ్క‌ర్‌, మ‌ధు కాలిపు అనే కొత్త నిర్మాత‌లు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

మ‌రాఠీలో మ‌హేష్ మంజ్రేక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన న‌ట సామ్రాట్‌లో నానా ప‌టేక‌ర్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ఆయ‌న అద్భుత న‌ట‌న‌తో ఈ సినిమాను నిల‌బెట్టాడు. ప్ర‌కాష్ రాజ్ సైతం ఈ సినిమాలో న‌ట విశ్వ‌రూపం చూపించే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. మ‌రి కృష్ణ‌వంశీ ఈ సినిమాతో ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English