ట్రేడ్‌: హిందీ ఏమోగానీ వున్నది ఊడింది!

ట్రేడ్‌: హిందీ ఏమోగానీ వున్నది ఊడింది!

బాహుబలి తర్వాత పాన్‌ ఇండియా సినిమాలు తీసేసి హిందీ మార్కెట్‌ని కూడా సొంతం చేసుకోవాలనే ఆరాటం మన నిర్మాతలలో పెరిగింది. హిందీలో పాగా వేయడం అంత సులభం కాదని సైరాకి వచ్చిన స్పందనతో తేలిపోయింది. అయితే ఈ క్రమంలో ఇంతకుముందు అతి పెద్ద మార్కెట్లుగా నిర్మాతలకి ధీమాగా వున్న కర్నాటక, ఓవర్సీస్‌ మార్కెట్లు గణనీయంగా తగ్గిపోయాయి.

కారణం ఏదయినా కానీ కర్నాటకలో తెలుగు సినిమాలు గతంలో మాదిరిగా ఆడడం లేదు. సాహో, సైరా చిత్రాలపై భారీ రేట్లు పెట్టిన బయ్యర్లు దారుణంగా దెబ్బ తిన్నారు. ఓవర్సీస్‌లో సైరాని రీజనబుల్‌ రేట్లకే ఇచ్చినా కానీ నష్టం తప్పలేదు. దీంతో ఇక మీదట తెలుగు సినిమాలకి కర్నాటక, ఓవర్సీస్‌ నుంచి కనీసం పదిహేను కోట్ల లోటు పడుతుంది. ఇంతకాలం ఇంత బిజినెస్‌ జరుగుతుందనే ధీమాతో ఖర్చు పెట్టి, హీరోల పారితోషికం కూడా అందుకు అనుగుణంగా పెంచేసిన నిర్మాతలు ఇక మీదట జాగ్రత్త పడాలి.

బిజినెస్‌లో పదిహేను కోట్ల లోటు అంటే నిర్మాతకి మిగిలే లాభం కంటే చాలా ఎక్కువ. కాబట్టి నిర్మాత గట్టున పడాలంటే అర్జంటుగా పారితోషికాలు తగ్గించడంతో పాటు నిర్మాణ వ్యయం కూడా అదుపులోకి తీసుకురావాలి. తెలుగు సినిమా మార్కెట్‌ గణనీయంగా పెరిగిపోయిందనే బబుల్‌ బరస్ట్‌ అయి వాస్తవం బోధ పడడంతో ఇక మీదట భారీ సినిమాలు తీసే నిర్మాతలంతా జాగ్రత్త పాటించాల్సి వుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English