మహేష్‌ని మచ్చిక చేసుకుంటున్న విజయ్‌

మహేష్‌ని మచ్చిక చేసుకుంటున్న విజయ్‌

విజయ్‌ దేవరకొండకి యూత్‌ ఫాలోయింగ్‌ బాగానే వుంది కానీ ఇంకా మాస్‌లోకి వెళ్లలేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో కూడా ఇంకా తనకు పూర్తి యాక్సెప్టన్స్‌ రాలేదని 'గీత గోవిందం' తర్వాత వచ్చిన సినిమాలతో రుజువయింది. దీంతో స్టడీ ఫాన్‌ బేస్‌ కోసం విజయ్‌ దేవరకొండ గట్టిగా కృషి చేస్తున్నాడు. ఇందులో భాగంగా మహేష్‌బాబు అభిమానులని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసాడు. మహర్షి ఆడియో రిలీజ్‌కి అతిథిగా వెళ్లిన విజయ్‌ దేవరకొండ ఇప్పుడు తన నిర్మాణంలో రూపొందిన 'మీకు మాత్రమే చెప్తా' ట్రెయిలర్‌ని మహేష్‌తో లాంఛ్‌ చేయిస్తున్నాడు.

ఇలాంటి వాటి వల్ల సదరు హీరోల అభిమానులకి వీళ్ల పట్ల సాఫ్ట్‌ కార్నర్‌ ఏర్పడుతుంది. ఉదాహరణకి నితిన్‌ అంటే పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఇష్టపడతారు. అతడిని తమ వాడిగానే ట్రీట్‌ చేస్తూ అతని చిత్రాలు వచ్చినపుడు ఎంకరేజ్‌ చేస్తుంటారు. సోషల్‌ మీడియాతో పాటు రిలీజ్‌ రోజు మంచి టాక్‌ స్ప్రెడ్‌ చేయడంలో హెల్ప్‌ అవుతుంటారు. చూస్తోంటే విజయ్‌ దేవరకొండ కూడా అలా మహేష్‌ అభిమానులకి దగ్గర కావాలనే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. మరి పవన్‌ అభిమానులు నితిన్‌ని ఓన్‌ చేసుకున్నట్టు విజయ్‌ని మహేష్‌ అభిమానులు కూడా తమ వాడిగా భావిస్తారా లేదా అనేది వేచి చూడక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English