బిగ్‌బాస్‌ 3 విన్నర్‌ ఫిక్స్‌!

బిగ్‌బాస్‌ 3 విన్నర్‌ ఫిక్స్‌!

బిగ్‌బాస్‌ సీజన్‌ 3కి కూడా అనూహ్యమైన సభ్యుడే విజేతగా నిలబడనున్నాడా? గత ఏడాది కౌశల్‌ విజేత అవుతాడని సీజన్‌ స్టార్ట్‌ అయినపుడు ఎవరూ అనుకోలేదు. కానీ అతడు మూడవ వారం నుంచి షోని శాసించే పవర్‌గా అవతరించాడు. ఈ సీజన్‌ సభ్యులలో రాహుల్‌ సిప్లిగంజ్‌ మహా అయితే నాలుగు వారాలుంటాడని భావించారు. కానీ అతనిప్పుడు టైటిల్‌ గెలుచుకునే దిశగా దూసుకుపోతున్నాడు.

గత సీజన్‌లో తేజస్వి మాదిరిగా నోరు పారేసుకోకుండా జాగ్రత్త పడాలని ఇచ్చిన సూచనలని బాగానే పాటించిన శ్రీముఖి కీలక సమయాలలో సంయమనం కోల్పోయింది. రాహుల్‌ని టార్గెట్‌ చేస్తూ అతడిని ఎలాగయినా బయటకు పంపించాలని చూసింది. ఆమె నేచర్‌ నచ్చని వారంతా రాహుల్‌ సైడ్‌ తీసుకున్నారు. సడన్‌గా అతని ఓటింగ్‌ పర్సంటేజ్‌ పెరుగుతూ వచ్చింది. బాబా భాస్కర్‌ మంచితనం పేరుతో అసలు నోరెత్తకపోవడం, ముఖ్యంగా శ్రీముఖికి వత్తాసు పలుకుతూ వుండడంతో అతను యువతరానికి నచ్చడం లేదు. అదే సమయంలో శ్రీముఖికి ఎప్పుడూ ఎదురు నిలబడుతుతోన్న రాహుల్‌కి వారు ఓట్లు గుద్దేస్తున్నారు.

లెవల్‌ హెడెడ్‌గా అనిపించిన వరుణ్‌ సందేశ్‌ తన భార్య వీక్‌నెస్‌తో వెనుకబడిపోయాడు. తన బార్బర్‌ వృత్తి గురించి గర్వంగా చెప్పుకుంటూ, డిగ్నిటీ ఆఫర్‌ లేబర్‌ గురించి చక్కగా మాట్లాడడం రాహుల్‌కి అదనపు బలాన్నిచ్చింది. దానికి తోడు పునర్నవితో కాస్త మసాలా కూడా జోడించడంతో అతనికి వీకెండ్‌ ఎపిసోడ్స్‌లో మైలేజీ వచ్చింది. హౌస్‌లో వున్న ఏడుగురూ నామినేట్‌ కాగా, రాహుల్‌కి మూడో వంతు ఓట్లు పోల్‌ అవుతున్నాయి. మిగతావి మిగిలిన ఆరుగురు షేర్‌ చేసుకోవాల్సి వస్తోంది. ఇంకా రెండు వారాలే మిగిలి వుండగా ఫైనల్‌కి కూడా ఇదే ట్రెండ్‌ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది కనుక ఈసారి విజేత రాహుల్‌ అని ఫిక్స్‌ చేసేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English