వెంకీ మామకి దిల్‌ రాజు, చినబాబు ఆఫర్‌!

వెంకీ మామకి దిల్‌ రాజు, చినబాబు ఆఫర్‌!

దసరాకే రావాల్సిన వెంకీ మామ వాయిదా పడి దీపావళికి వస్తుందని అనుకున్నారు. తర్వాత డిసెంబర్‌కి వాయిదా పడిందని అన్నారు. తీరా టీజర్‌ రిలీజ్‌ అయ్యాక ఇది పండక్కి రావాల్సిన సినిమాలా వుందని అనేసరికి సంక్రాంతికి విడుదల చేద్దామనే ఆలోచన మొదలు పెట్టారు. దీంతో పండక్కి థియేటర్లన్నీ తలా సగం పంచుకుందామని ఫిక్స్‌ అయిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో నిర్మాతలు షాక్‌ తిన్నారు.

సురేష్‌ బాబు గేమ్‌లోకి వస్తే కనీసం నాలుగు వందల థియేటర్ల మేరకు కోత పడుతుంది కనుక ఆయా చిత్రాల బయ్యర్లు కూడా హైరానా పడ్డారు. అందులో భాగంగానే రెండు సినిమాలనీ ఒకే రోజున విడుదల చేస్తున్నట్టు ప్రకటనలు కూడా ఇచ్చారు. డేట్‌ విషయంలో ఏర్పడిన తకరారు తర్వాత తీర్చుకుందామని ఇరు చిత్రాల నిర్మాతలు ప్రస్తుతానికి మిన్నకున్నారు. అయితే వెంకీ మామ మాత్రం సంక్రాంతి బరిలోకి రాకూడదని ఇద్దరూ గట్టిగా ట్రై చేస్తున్నారు.

ఇందులో భాగంగా డిసెంబర్‌ 20న వెంకీ మామకి సోలో రిలీజ్‌ ఇచ్చేయాలని చూస్తున్నారు. డిసెంబర్‌ 20కి అనుకుంటోన్న సినిమాలలో భీష్మ, ప్రతిరోజు పండగే చిత్రాలకి 'అల వైకుంఠపురములో' నిర్మాతలే నిర్మాతలు. అలాగే 96కి 'సరిలేరు నీకెవ్వరు' నిర్మిస్తోన్న దిల్‌ రాజు నిర్మాత. ఈ మూడు సినిమాలనీ డిసెంబర్‌ 20నుంచి తప్పిస్తామని సురేష్‌కి ఆఫర్‌ ఇచ్చారట. మరి ఆ డేట్‌కి సోలో రిలీజ్‌ చేసుకుందామని భావిస్తారా లేక సంక్రాంతి బెస్ట్‌ ఆప్షన్‌ అనుకుంటారా అనేది సురేష్‌బాబు ఇష్టం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English