కళ్యాణ్ రామ్‌ను కన్సిడర్ చేయరేంటబ్బా..

కళ్యాణ్ రామ్‌ను కన్సిడర్ చేయరేంటబ్బా..

సంక్రాంతి సినిమాలు ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ ఒకే రోజు విడుదల కాబోతుండటం మీద ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద చర్చే నడుస్తోంది. డేట్ విషయంలో ఎన్నో ఆప్షన్లు ఉండగా ఒకే రోజు, అది కూడా ఆదివారం ఈ సినిమాల్ని రిలీజ్ చేయాలనుకోవడంలో ఆంతర్యమేంటో అంతుబట్టట్లేదు. ‘వెంకీ మామ’ సినిమా సంక్రాంతి రేసులోకి రావడంతోనే హడావుడిగా ఒకరికి పోటీగా ఒకరు రిలీజ్ డేట్ ఇచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి.

ఇలా పోటీ పడటం వల్ల రెంటికీ నష్టమే అన్న డిస్కషన్లు నడుస్తున్నాయి. దీని ప్రభావం ఓపెనింగ్స్ మీద ఏ మేరకు ఉంటుందని చర్చిస్తున్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్‌ల్లో ఎవరిది పైచేయి అవుతుంది..  ఏ సినిమా సత్తా ఎంత.. దేనికి లాభం, దేనికి నష్టం.. అనే చర్చ జోరుగా నడుస్తోంది.

మరోవైపు రజనీకాంత్ సినిమా ‘దర్బార్’ను సంక్రాంతి రేసులో ముందుగా నిలబెట్టి రెండు రోజులు వసూళ్ల మోత మోగించుకోవడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లుగా ఒక ముచ్చట హల్ చల్ చేస్తోంది. ఇంకోవైపు ‘వెంకీ మామ’ సంక్రాంతికి వస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది.. మహేష్, బన్నీ సినిమాలపై దీని ప్రభావం, దీనిపై ఆ రెండింటి ప్రభావం ఎలా ఉంటుందని కూడా డిస్కషన్లు నడుస్తున్నాయి.

ఐతే ఇలా అన్ని సినిమాల గురించీ చర్చ జరుగుతోంది కానీ.. సంక్రాంతి బరిలోనే ఉన్న కళ్యాణ్ రామ్ సినిమా ‘ఎంతమంచివాడవురా’ గురించి మాట్లాడే నాథుడే లేడు. ‘వెంకీ మామ’ సంక్రాంతికే వస్తే దీని పరిస్థితేంటి.. అసలిది సంక్రాంతి బరిలో ఉంటుందా లేదా.. ఓవైపు మహేష్, బన్నీ రేసులో ఉండగా కళ్యాణ్ రామ్ కాన్ఫిడెన్స్ ఏంటి.. అసలు ‘ఎంతమంచివాడవురా’ ఏ రోజు రాబోతోంది.. అని మాట్లాడేవాళ్లే లేరు. సంక్రాంతికే రాబోతున్నా అని టీజర్లో కళ్యాణ్ రామ్ స్పష్టంగా చెప్పినా.. దీన్ని సంక్రాంతి సినిమాలా భావించట్లేదు జనాలు. మరీ కళ్యాణ్ రామ్‌ను అసలు కన్సిడర్ చేయకపోవడమేంటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English