ఆ సినిమా ఎందుకంత పెద్ద డిజాస్టర్ అయిందంటే..

ఆ సినిమా ఎందుకంత పెద్ద డిజాస్టర్ అయిందంటే..

దర్శకుడిగా రవిబాబు కెరీర్లో హిట్లున్నాయి. ఫ్లాపులున్నాయి. ఐతే ‘అదిగో’ సినిమా మాత్రం అతను తట్టుకోలేనంత డిజాస్టర్ అయింది. అవమాన భారాన్ని మిగిల్చింది. రవిబాబు తీసిన సినిమాల్లో అత్యంత చెత్త అంటే ఇదేనేమో. మూడేళ్లు కష్టపడి తీసిన సినిమా ఇలా తయారవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఈ సినిమాకు అంతటి దారుణమైన ఫలితం ఎందుకు వచ్చిందో రవిబాబు.. తన కొత్త సినిమా ‘ఆవిరి’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించాడు.

అదిగో సినిమాను చిన్న సినిమాగా తక్కువ బడ్జెట్లో తీయాలని అనుకున్నానని.. నిజమైన పంది పిల్లను తీసుకొచ్చి, దాని కోసం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని పెట్టుకుని సినిమా తీద్దామని ప్లాన్ చేసినట్లు రవిబాబు వెల్లడంచాడు. నిజమైన పంది పిల్లను తెచ్చి షూట్ చేసే ప్రయత్నం కూడా చేశామని.. కానీ అది అస్సలు కదలకపోవడంతో చిత్రీకరణ కష్టమని అర్థమైందన్నాడు. దీంతో త్రీడీ యానిమేషన్లో సినిమా చేయడానికి రెడీ అయ్యామని.. అక్కడే లాక్ అయిపోయామని చెప్పాడు.

త్రీడీలో సమస్యలు ఉంటాయని తెలుసు కానీ.. అన్ని వస్తాయని అనుకోలేదని.. మామూలుగా నెలన్నరలో షూటింగ్ పూర్తి చేసే తాను 80 రోజులు తీసుకున్నానని.. తర్వాత సీజీ చేయడానికి రెండేళ్ల సమయం పట్టిందని రవిబాబు వెల్లడించాడు. నిర్మాతగా తాను ఫైనాన్షియల్‌గా బయటపడినా సినిమా అనుకున్న ఫలితాన్నివ్వలేదని.. సినిమా రిలీజ్ టైమింగ్ కూడా సరిగా కుదరలేదని.. దీపావళి రోజు విడుదల చేయడం మరింతగా దెబ్బ కొట్టిందని రవిబాబు చెప్పాడు. తన కొత్త సినిమా ‘ఆవిరి’ కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచి మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని రవిబాబు ధీమా వ్యక్తం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English