మహేష్, బన్నీ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?

మహేష్, బన్నీ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా మీద మహేష్ బాబుతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత అనిల్ సుంకర ఏ స్థాయిలో కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారో తెలిసిందే. తన కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అవుతుందని, తన అభిమానులు గర్వపడేలా సినిమా ఉంటుందని అంటున్నాడు మహేష్. దర్శక నిర్మాతల మాటల్లోనూ ఇదే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది.

మరోవైపు ‘అల వైకుంఠపురములో’ చిత్ర బృందం కాన్ఫిడెన్స్ కూడా మామూలుగా లేదు. అది నాన్ స్టాప్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ఈ రెండు సినిమాల మేకర్స్ ఫలితం మీద చాలా ధీమాగా ఉన్నారు. తమ సినిమాను చూసి అవతలి వాళ్లే భయపడాలంటున్నారు. తమ చిత్రానికి ఢోకా లేదంటున్నారు. ఐతే సినిమా రిజల్ట్ మీద ఇంత ధీమా ప్రకటిస్తున్నవాళ్లు.. పోటీకి కూడా సై అంటున్నవాళ్లు.. ఎప్పుడూ సినిమాలు రిలీజయ్యే శుక్రవారం తమ చిత్రాన్ని రిలీజ్ చేసుకుని అడ్వాంటేజ్ పొందడానికి భయపడుతున్నారు.

జనవరి 10న సినిమాను రిలీజ్ చేస్తే ఆటోమేటిగ్గా ఆ రోజు ఫుల్స్ పడతాయి. శనివారం కూడా కలెక్షన్లకు ఢోకా ఉండదు. అయినా ఆదివారం రిలీజ్‌కే సై అంటున్నారు. ఈ రిస్క్ తీసుకుంటున్నవాళ్లు.. 10న సినిమాను రిలీజ్ చేసే సాహసం మాత్రం చేయట్లేదు. ఇక్కడ త్రివిక్రమ్‌ను ‘అజ్ఞాతవాసి’, మహేష్‌ను ‘1 నేనొక్కడినే సెంటిమెంట్లు భయపెడుతున్నాయి. ఆ రెండు చిత్రాలూ జనవరి 10నే రిలీజై డిజాస్టర్లయ్యాయి. కానీ అవి 10వ తేదీ రిలీజవ్వడం వల్ల డిజాస్టర్లయ్యాయా.. సినిమాలు బాగా లేకపోవడం వల్ల ఆడలేదా అన్నది ఆలోచించకపోవడం విడ్డూరం.

‘అల..’, ‘సరిలేరు’ సినిమాలు బాగుంటే 10న రిలీజైనా హిట్టవుతాయి. వాటిలో ఏది బాగా లేకున్నా 12న వచ్చినా ఫ్లాపే అవుతాయి. ఏదైనా కూడా సినిమా ఎలా ఉంటుందన్నదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప.. డేట్‌ను బట్టి ఫలితం ఉండదు. ఇది చాలా సింపుల్ లాజిక్. తమ సినిమాల మీద ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న ఈ చిత్ర బృందాలు.. అంత నమ్మకం ఉన్నపుడు 10నే ధీమాగా రిలీజ్ చేయొచ్చు కదా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English