గీతా ఆర్ట్స్‌ అల్లు అర్జున్‌ టేకోవర్‌ చేసాడా?

గీతా ఆర్ట్స్‌ అల్లు అర్జున్‌ టేకోవర్‌ చేసాడా?

అల్లు అర్జున్‌ సొంతంగా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయాలని చూస్తున్నాడని ఆమధ్య బలంగా వినిపించింది. ఒక రైటర్స్‌ టీమ్‌ని పెట్టుకుని నిత్యం కథలు వింటూ అందుకోసం అల్లు అర్జున్‌ ప్రయత్నాలు చేసినట్టు కూడా చెప్పుకున్నారు. అయితే అల వైకుంఠపురములో చిత్రానికి గీతా ఆర్ట్స్‌ని భాగస్వామిని చేసి అల్లు అర్జున్‌ ఆ వదంతులకి తాత్కాలికంగా బ్రేక్‌ వేసాడు.

హారిక హాసిని సంస్థలో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ చిత్రానికి అల్లు అరవింద్‌ పేరు జోడించింది అల్లు అర్జునే. గీతా ఆర్ట్స్‌ వ్యవహారాలు అల్లు శిరీష్‌ చూసుకుంటాడని అనుకున్నారు కానీ అతనికి హీరోగా నిలబడాలనే కోరిక వుండడంతో సైడ్‌ ట్రాక్‌ అయిపోయాడు. అలాగే అల్లు అర్జున్‌ అన్నయ్య బాబీ కూడా సొంతంగా నిర్మాణ సంస్థ స్థాపించి వరుణ్‌ తేజ్‌తో సినిమా లాంఛ్‌ చేసాడు. దీంతో గీతా ఆర్ట్స్‌ని అల్లు అర్జున్‌ టేకోవర్‌ చేయబోతున్నాడని బాగా వినిపిస్తోంది.

ఇకపై తాను చేసే చిత్రాలకి గీతా ఆర్ట్స్‌ని భాగస్వామిని చేసి సంస్థని ముందుకి తీసుకెళ్లాలని, అలాగే తన స్నేహితుడు బన్నీ వాస్‌తో కలిసి గీతా ఆర్ట్స్‌పై ఇతర చిత్రాలని కూడా నిర్మించాలని అల్లు అర్జున్‌ భావిస్తున్నాడని ప్రచారంలో వుంది. రామ్‌ చరణ్‌ నిర్మాతగా బిజీగా వుండడం, ప్రభాస్‌, మహేష్‌లు కూడా సొంత నిర్మాణ సంస్థలనే ఎంకరేజ్‌ చేస్తుండడంతో అల్లు అర్జున్‌ కూడా గీతా ఆర్ట్స్‌ లెగసీని కొనసాగించే బాధ్యతలు తీసుకున్నట్టే అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English