ఏపీ ఎయిర్ పోర్టులు 13?.. 26?

ఏపీ సీఎం జ‌గ‌న్ పై నెటిజ‌న్లు భారీ ఎత్తున సెటైర్లు కుమ్మేస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న‌.. రాష్ట్రంలోని ప్ర‌తి జిల్లాకు ఒక విమానాశ్ర‌యం నిర్మిస్తామ‌ని చెప్పారు. కేబినెట్ మీటింగ్‌లోనూ దీనిపై తీర్మానం చేశారు. దీంతో సీఎం జ‌గ‌న్‌ప్ర‌క‌ట‌న‌ను ఆ పార్టీ నాయ‌కులు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు. ప్ర‌తి జిల్లాకు ఒక‌టి చొప్పున విమానా శ్ర‌యం క‌డుతున్నారంటూ.. ప్ర‌చారం చేశారు. అయితే.. దీనిపై నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. జ‌గ‌న్ చెప్పిన‌ట్టు జిల్లాకు ఒక‌టి చొప్పున క‌డితే.. కొత్త‌గా 13 విమానాశ్ర‌యాలు క‌ట్టాలి.

అయితే.. వీటి వ‌ల్ల ఎవ‌రికి ప్ర‌యోజ‌నం? అనేది నెటిజ‌న్ల ప్ర‌శ్న‌. రాష్ట్రంలో మెజారిటీ ప్ర‌జ‌లు వినియోగించే బ‌స్సు స్టాండుల్లో సౌక‌ర్యాలు లేవు. ర‌హ‌దారులు నిలువెత్తు గోతుల‌తో ఉన్నాయి. వీటిని బాగు చేయ‌డం మానేసి.. జిల్లాకో విమానాశ్ర‌యం క‌డితే.. ఎవ‌రికి ప్ర‌యోజ‌నం. నిజానికి ఇప్ప‌టికీ.. చాలా గ్రామాల‌కు బ‌స్సు సౌక‌ర్యం లేదు.

ఇక‌, ఉన్న బ‌స్టాండ్లలోనూ.. మౌలిక స‌దుపాయాలు కూడా లేకుండా పోయాయి. నిత్యం ప్ర‌జ‌ల‌కు అత్యంత అవ‌స‌ర‌మైన వీటిని బాగు చేయ‌కుండా.. విమానాశ్ర‌యాలు క‌ట్ట‌డం వ‌ల్ల ఎవ‌రికి ప్ర‌యోజ‌నం అని నెటిజ‌న్లు అంటున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు మ‌రో సెట‌ర్ కూడా హ‌ల్చ‌ల్ చేస్తోంది. జ‌గ‌న్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన‌ప్పుడు రాష్ట్రం లో 13 జిల్లాలు ఉంటే.. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో 26 జిల్లాల‌ను ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పిన‌ట్టు ఆయ‌న సొంత మీడి యాలోనే వ‌చ్చింది.

మ‌రి ఇప్పుడు జ‌గ‌న్ ఈ 26 జిల్లాల్లోనూ.. విమానాశ్ర‌యాలు నిర్మిస్తారా? అనేది ప్ర‌శ్న‌. ఒక‌వైపు… ర‌హ‌దారులు వేసేందుకు నిధులు లేవు. మ‌రోవైపు.. ఉద్యోగుల‌కు ఇచ్చేందుకునిధులు లేవు. పేద విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమ‌లు చేసేందుకుకుస్తీ ప‌డుతున్న ప‌రిస్థితి. కానీ, జిల్లాకో.. విమానాశ్ర‌యం మాత్రం పెడ‌తారట‌! ఇదీ.. ఇప్పుడు నెటిజ‌న్ల నుంచి వ‌స్తున్న ప్ర‌ధాన విమ‌ర్శ‌. మ‌రి దీనికి వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.