మళ్లీ అర్జున్ రెడ్డి కాంబినేషన్ పక్కా

మళ్లీ అర్జున్ రెడ్డి కాంబినేషన్ పక్కా

‘అర్జున్ రెడ్డి’తో ఒకేసారి టాప్ డైరెక్టర్ల లీగ్‌లోకి చేరిపోయాడు సందీప్ రెడ్డి వంగ. అతడితో సినిమా చేయడానికి మహేష్ బాబు సైతం ఆసక్తి ప్రదర్శించాడు. కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ‘అర్జున్ రెడ్డి’ చూసి బౌల్డ్ అయిపోయిన చాలామంది స్టార్లు అతడితో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ అతను మాత్రం ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’తో బాలీవుడ్లోకి అడుగు పెట్టాడు. అది అక్కడ బ్లాక్‌బస్టర్ అయి బాలీవుడ్లో అతడిని స్టార్‌ను చేసింది. ఇప్పుడు తన మూడో సినిమాను కూడా అక్కడే చేయాల్సిన కంపల్షన్ వచ్చింది సందీప్‌కు.

స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా అతడి తర్వాతి సినిమా ఉంటుందని అంటున్నారు. ‘కబీర్ సింగ్’ నిర్మాతలతోనే కలిసి ఈ చిత్రాన్ని సందీపే స్వయంగా నిర్మిస్తున్నాడు. దీని తర్వాత అయినా సందీప్ టాలీవుడ్‌కు తిరిగొస్తాడా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ విషయంలో సందీప్ స్పష్టత ఇచ్చాడు. తన నాలుగో సినిమా తెలుగులోనే ఉంటుందన్నాడు. అంతే కాదు.. అది ‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండతో ఉంటుందని కూడా వెల్లడించాడు.

తాజాగా ముంబయిలో జరిగిన ఒక అవార్డుల వేడుకలో సందీప్ ఈ విషయాన్ని వెల్లడించాడు. దీంతో ‘అర్జున్ రెడ్డి’ చూసి మెస్మరైజ్ అయిన అందరికీ ఈ న్యూస్ అమితానందాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం విజయ్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ‘డియర్ కామ్రేడ్’తో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు. క్రాంతి మాధవ్ సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’కు ఆశించిన బజ్ లేదు. ‘హీరో’ సినిమాకు మధ్యలో బ్రేక్ పడిపోయింది. పూరి జగన్నాథ్ సినిమాను నమ్ముకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ సందీప్‌తో సినిమా చేస్తే దానికి వచ్చే క్రేజే వేరుగా ఉంటుంది. మళ్లీ అతడి కెరీర్ పుంజుకోవడానికి అవకాశముంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English