వెంకీ మామా.. ఏంటీ డైలమా?

వెంకీ మామా.. ఏంటీ డైలమా?

అనుకోకుండా ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో ‘వెంకీ మామ’ సినిమా హాట్ టాపిక్ అయిపోయింది. ఈ సినిమా సంక్రాంతి రేసులో నిలుస్తుందన్న వార్త పెద్ద చర్చకే దారి తీసింది. నిజానికి ఈ సినిమా మొదలైనపుడు దసరాకు రిలీజ్ అనుకున్నారు. ఆ తర్వాత దీపావళి అన్నారు. తర్వాత క్రిస్మస్ రేసులోకి ఈ సినిమా వస్తుందని ప్రచారం జరిగింది. ఇప్పుడేమో సంక్రాంతి అంటున్నారు.

జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారని.. ఈ సంగతి తెలిసే ‘అల వైకుంఠపుములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల రిలీజ్ డేట్లు హడావుడిగా ప్రకటించారని వార్తలొచ్చాయి. ఇప్పుడేమో ‘వెంకీ మామ’ జనవరి 11న అని.. కాదు 14న అని రకరకాల వార్తలొస్తున్నాయి. అదే సమయంలో సంక్రాంతికి ఈ సినిమా రావడం డౌటే.. అంత పోటీలో ఎందుకులే అని డిసెంబర్లోనే రిలీజ్ చేసేయబోతున్నారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఐతే నాలుగైదు రోజులుగా ‘వెంకీ మామ’పై రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి కానీ.. చిత్ర బృందం నుంచి మాత్రం అసలు చప్పుడే లేదు. దసరా కానుకగా టీజర్ రిలీజ్ చేశాక సినిమా నుంచి ఏ అప్ డేట్ లేదు. నిర్మాత సురేష్ బాబు తమ సినిమా గురించి నడుస్తున్న చర్చను ఎంజాయ్ చేస్తూ సైలెంటుగా ఉన్నట్లున్నారు.

అయితే ఈ డైలమాకు సాధ్యమైనంత త్వరగా తెరదించి రిలీజ్ డేట్ ప్రకటిస్తే బాగుంటుందనే అభిప్రాయం ఇండస్ట్రీ జనాల్లో వ్యక్తమవుతోంది. సురేష్ బాబు చేతిలో థియేటర్లుండటం, సంక్రాంతికి సరిపోయే ఫ్యామిలీ సినిమా కావడం వల్ల సంక్రాంతికి రావాలనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు కానీ.. ‘అల..’, ‘సరిలేరు’ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్లే. వాటి రేంజే వేరు.

ఆ రెండు సినిమాలకూ మంచి హైప్ కూడాా ఉంది. ఈ నేపథ్యంలో ఓవర్ కాన్ఫిడెన్సు‌తో సంక్రాంతి రేసులో నిలవడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవతున్నాయి. ఐతే సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలన్నది నిర్మాత ఇష్టం కానీ.. ఆ సంగతేతో తేల్చేసి ఉత్కంఠకు తెరదించాల్సిన అవసరమైతే ఉంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English