దిల్ రాజు వద్దన్నా వినకుండా ప్రొడ్యూస్ చేశాడట

దిల్ రాజు వద్దన్నా వినకుండా ప్రొడ్యూస్ చేశాడట

అగ్ర నిర్మాత దిల్ రాజు అప్పుడప్పుడూ చిన్న సినిమాల్ని టేకప్ చేసి తన బేనర్ ద్వారా రిలీజ్ చేస్తుంటాడు. ఆ కోవలోనే ఇటీవల దసరా రోజున ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అనే చిన్న సినిమాను విడుదల చేశాడు. అయితే దీనికి ఆశించిన స్థాయిలో ప్రి రిలీజ్ బజ్ రాలేదు. టాక్ పర్వాలేదనిపించడంతో సినిమా తక్కువ థియేటర్లలోనే ఓ మోస్తరుగా ఆడుతోంది.

ఈ చిత్ర కథానాయకుడు రాకేష్ వర్రె ‘బద్రీనాథ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ లాంటి సినిమాల్లో కాస్త గుర్తింపు ఉన్న పాత్రలే చేశాడు. ఇండస్ట్రీలో అతడికి పరిచయాలు బాగానే ఉన్నట్లున్నాయి. ఈ పరిచయాల వల్లో, లేక దిల్ రాజు సినిమా కావడం వల్లో కానీ సుకుమార్, కొరటాల శివ లాంటి అగ్ర దర్శకులు ఈ సినిమా గురించి బైట్స్ ఇచ్చి ప్రమోట్ చేస్తుండటం విశేషం.

‘సైరా నరసింహారెడ్డి’ ఆడుతుండగా తమ సినిమాను జనాలు పట్టించుకుంటారో లేదో అని భయపడ్డామని.. కానీ ఆక్యుపెన్సీ బాగానే ఉందని, సినిమా తక్కువ థియేటర్లలోనే మంచి వసూళ్లతో సాగిపోతోందని రాకేశ్ అన్నాడు. దసరా వీకెండ్లో తమ సినిమాకు హౌస్ ఫుల్స్ కూడా పడినట్లు అతను చెప్పాడు. హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు వెళ్తే 1000 కెపాసిటీ ఉన్న ఆ థియేటర్‌కు 800 మంది దాకా వచ్చారని అతను చెప్పాడు.

 ఈ సినిమా కథ తనకు నచ్చినా నిర్మాతల్ని ఒప్పించడం చాలా కష్టమైందని.. క్యాస్ట్ చుట్టూ తిరిగే కథ కావడంతో ఎవరూ ధైర్యం చేయలేదని.. అలాంటి సమయంలో దిల్ రాజుకు కథ చెబితే బాగుందన్నారని.. కానీ నువ్వు మాత్రం నిర్మించొద్దు అని చెప్పారని.. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తనే ధైర్యం చేసి సినిమా ప్రొడ్యూస్ చేశానని.. ఈ విషయం తెలిసి తనను దిల్ రాజు తిట్టాడని.. తర్వాత సినిమా చూసి మెచ్చుకుని తన బేనర్ ద్వారా రిలీజ్ చేశాడని రాకేశ్ వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English