‘వాల్మీకి’కి దేవిశ్రీ దూరమైంది అందుకా?

‘వాల్మీకి’కి దేవిశ్రీ దూరమైంది అందుకా?

దర్శకుడు హరీష్ శంకర్‌కు తెలుగులో ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీ ప్రసాద్ ఒకడు. వీళ్లిద్దరి కలయికలో ‘గబ్బర్ సింగ్’, ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్లు వచ్చాయి. ఈ కాంబినేషన్లోనే ‘వాల్మీకి’ సినిమా రావాల్సింది. సినిమా పోస్టర్ మీద సంగీత దర్శకుడిగా దేవిశ్రీ పేరే పడింది కూడా.

కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో.. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మారిపోయాడు. మిక్కీ జే మేయర్ లైన్లోకి వచ్చాడు. ఈ మార్పు ఎందుకు జరిగిందో తాజాగా ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకరే వెల్లడించాడు. దేవితో తనకు మంచి అనుబంధం ఉందని, ‘వాల్మీకి’కి అతడితోనే సంగీతం చేయించుకోవాలనే ఉద్దేశంతో అడక్కుండానే కాన్ఫిడెంటుగా పోస్టర్ మీద పేరు వేయిం చేశానని.. కానీ తర్వాత చెన్నైకి వెళ్లి దేవిని కలిశాక ఒక సమస్య తలెత్తిందని హరీష్ వెల్లడించాడు.

‘వాల్మీకి’ సినిమాలో ఎల్లువొచ్చి గోదారమ్మ పాటను రీమిక్స్ చేయాలని అనుకున్నామని.. ఇదే విషయాన్ని దేవికి చెబితే రీమిక్స్ పాటలు చేయకూడదన్నది తన పాలసీ అని.. ఇప్పటిదాకా అలా ఎప్పుడూ ట్రై చేయలేదని, ఇక ముందూ చేయబోనని చెబుతూ సున్నితంగా ఈ అవకాశాన్ని తిరస్కరించాడని హరీష్ చెప్పాడు.

70 సినిమాలకు పైగా సంగీతం అందించిన దేవిని ఇబ్బంది పెట్టి అతడి పాలసీ మార్చుకోమని ఒత్తిడి తేవడం కరెక్ట్ అనిపించలేదని.. అదే సమయంలో సినిమాకు ఈ పాట కీలకంగా తాను భావించడంతో దాన్ని దేవి కోసం పక్కన పెట్టాలని అనుకోలేదని.. అందుకే మరో సంగీత దర్శకుడిని పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాని.. అలా మిక్కీ జే మేయర్ లైన్లోకి వచ్చాడని వెల్లడించాడు హరీష్. అయితే ఈ సినిమాకు ఇప్పుడు ఎల్లువొచ్చి గోదారమ్మా పాటనే పెద్ద హైలైట్‌గా నిలిచిన నేపథ్యంలో దేవిని పక్కన పెట్టడం కరెక్ట్ అనే భావించాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English