పవన్‌కళ్యాణ్‌లో అదే అయోమయం

పవన్‌కళ్యాణ్‌లో అదే అయోమయం

ముఖ్యమంత్రి రేసు మాట అటుంచి కనీసం ఎమ్మెల్యేగా గెలిచినా కానీ పవన్‌కళ్యాణ్‌ చేతిలో ఇప్పుడు చాలా పని వుండేది. ఎన్నికలకి ముందు ఎలాగయితే సమస్యలపై ట్వీట్ల యుద్ధం చేసేవాడో ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నాడు. అప్పట్లో సినిమాలు చేస్తూ ట్వీట్లు వేసేవాడు. ఇప్పుడు సినిమాలు కూడా చేయడం లేదు. ఖాళీ ఎక్కువ కావడంతో పవన్‌ తిరిగి నటిస్తాడేమో అని ఆశపడే వాళ్లు ఎక్కువయ్యారు.

నటించాలనే ఇష్టం తనకి లేకపోయినా కానీ టెంప్టింగ్‌ ఆఫర్లతో నిర్మాతలు అతడిని నిత్యం వెంటాడుతున్నారు. ఈ నేపథ్యంలో గట్టిగా వారిని వారించడం మానేసి కథలు వినడం, వాటికి ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వడం కూడా చేస్తూ వుండడంతో ఏదో ఒక టైమ్‌లో మెత్తబడి సినిమా చేసేస్తాడని మరింత గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సినిమాలు తిరిగి చేయడం వల్ల పవన్‌పై ఒక రెండు, మూడు కామెంట్లు పడతాయేమో కానీ అంతకుమించి జరిగేదేమీ వుండదు.

అయితే తిరిగి నటించాలా, లేదా అనే దానిపై అయోమయం మాత్రం అతడిని వీడడం లేదు. రాజకీయాల్లోకి వెళ్లినపుడు ఎలాగయితే రెండు ఆలోచనలు చేసాడో, ఇప్పుడు పునరాగమనంపై కూడా అదే తీరు ప్రదర్శిస్తున్నాడు. ఇది పవన్‌ని మరింత చులకన చేస్తోందే తప్ప అతడి వ్యక్తిత్వాన్ని బలపరచడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English