చేపల మార్కెట్‌ని తలపించిన బిగ్‌బాస్‌

చేపల మార్కెట్‌ని తలపించిన బిగ్‌బాస్‌

ఫైనల్‌కి దగ్గర పడుతూ ఇంకా ఇంట్లో ఏడుగురు సభ్యులు మిగిలి వుండడంతో ఫైనల్‌లో చోటు దక్కదనే ఉత్కంఠ హౌస్‌లో వున్న అందరిలోను నెలకొంది. శ్రీముఖి, రాహుల్‌, వరుణ్‌ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తూ వుండగా, మిగిలిన నలుగురిలో ప్రతి ఒక్కరూ 'ఈవారం నేనేనేమో' అన్నట్టుగా వున్నారు. ఇలాంటి టైమ్‌లో ర్యాంకింగ్‌ టాస్క్‌ ఇచ్చి... మొదటి మూడు ర్యాంక్‌లలో వున్న వాళ్లు నామినేట్‌ అవరు అని బిగ్‌బాస్‌ చెప్పేసరికి, ఆ ర్యాంకుల కోసం మొదలైన బేరసారాలు చినికి చినికి గాలివానగా మారాయి.

రాహుల్‌కి దక్కిన సెకండ్‌ ర్యాంక్‌ తనకి ఇమ్మని ఏడవ స్థానంలో వున్న శ్రీముఖి అడగగా, అతను కుదరదని చెప్పాడు. అతడిని కన్విన్స్‌ చేయడం మానేసి శ్రీముఖి ఎప్పటిలా వాదనకి దిగి తన బలహీనత బయటపెట్టుకుంది. ఆ తర్వాత అలీ రెజా కూల్‌గా అడిగినపుడు రాహుల్‌ అతనికి తన ప్లేస్‌ ఇచ్చేసాడు. అయితే మూడవ స్థానం కోసం పెద్ద రచ్చే జరిగింది. ముందుగా అక్కడ వరుణ్‌ సందేశ్‌ వుంటే మాట్లాడుకుని వదిలేసిన శివజ్యోతి అదే స్థానాన్ని అతను వితికకి ఇచ్చేసరికి వాదనకి దిగింది. తనకెలా ఇచ్చేస్తావ్‌ అంటూ శివజ్యోతి అదే పనిగా వాదించడంతో వరుణ్‌ సందేశ్‌ తన ఆగ్రహాన్ని దాచుకోలేకపోయాడు.

శివజ్యోతిని వెక్కిరిస్తూ కొన్ని వెకిలి చేష్టలు చేసి తన ఇమేజ్‌ని మరోసారి భార్య కోసం డ్యామేజ్‌ చేసుకున్నాడు. ఈ వాదనలో మూడవ స్థానంనుంచి కదిలేది లేదంటూ శివజ్యోతి బైటాయించడంతో బిగ్‌బాస్‌ అందరినీ నామినేట్‌ చేసేసాడు. హౌస్‌లో వున్న అందరూ నామినేట్‌ అవడంతో అందరికంటే తక్కువ ఫాలోయింగ్‌ వున్న వ్యక్తి ఔట్‌ అయ్యే అవకాశాలు పెరిగాయి కనుక ఇంతకాలం భర్త చాటు దాగిన వితిక ఎలిమినేట్‌ అవడానికి స్కోప్‌ ఎక్కువ వుందని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English