బిగ్‌బాస్‌లోను వరుణ్‌ సందేశ్‌ ఫెయిల్‌!

బిగ్‌బాస్‌లోను వరుణ్‌ సందేశ్‌ ఫెయిల్‌!

హీరోగా ఘన విజయాలు అందుకుని కెరియర్‌ని అద్భుతంగా స్టార్ట్‌ చేసిన వరుణ్‌ సందేశ్‌ ఆ తర్వాత ప్లానింగ్‌లో దెబ్బ తిని పూర్తిగా కనుమరుగయ్యాడు. హ్యాపీడేస్‌, కొత్త బంగారు లోకం లాంటి విజయాలున్నా కానీ ఇప్పుడు వరుణ్‌ చేతిలో సినిమాలే లేవు. అవకాశాలు లేక బిగ్‌బాస్‌ రియాలిటీ షోకి వచ్చిన వరుణ్‌ సందేశ్‌ ఈ గేమ్‌లో కూడా తన కెరియర్‌లో చేసిన ప్లానింగ్‌ పొరపాట్లే చేస్తున్నాడు.

తన మృదుస్వభావం, టాక్టికల్‌ నేచర్‌తో ఫాన్స్‌ని గెలుచుకున్న వరుణ్‌ సందేశ్‌ నెమ్మదిగా టైటిల్‌ ఫేవరెట్‌గా అవతరించాడు. భార్యతో కలిసి గేమ్‌ ఆడడానికి వచ్చాడనేది అతడికి మొదట్లో ప్రతిబంధకమయినా కానీ పలుమార్లు తన భార్య తప్పులనే ఎత్తి చూపించి అందరి దృష్టిలో హీరో అయ్యాడు. అయితే ఎప్పుడో ఎలిమినేట్‌ కావాల్సిన తన భార్య వితిక లక్కీగా ఇంతకాలం సర్వయివ్‌ అయిపోవడంతో పోటీ చివరి దశలో భార్య తన పక్కనే వుండాలని వరుణ్‌ డిపెండెంట్‌గా మారిపోయాడు.

నామినేషన్స్‌లోకి వెళితే తన భార్య ఎలిమినేట్‌ అవుతుందని అతనికి తెలుసు. అందుకని ఆమె నామినేషన్స్‌లోకి రాకుండా వరుణ్‌ కాపాడుకుంటున్నాడు. ఇది అతనికి ఇప్పుడు ప్రతికూలంగా మారింది. గతవారమే ఎలిమినేట్‌ అయిపోతాడనే లెవల్లో వరుణ్‌కి వ్యతిరేకత వచ్చింది. దాంతో బిగ్‌బాస్‌ డైరెక్టర్లే రంగంలోకి దిగి శ్రీముఖి ఫాన్స్‌ని మహేష్‌ విట్టాకి అగెనెస్ట్‌గా మార్చాల్సి వచ్చింది.

విట్టా తాలూకు ఆ క్లిప్పింగులే లేకపోతే వరుణ్‌ ఎలిమినేట్‌ అయ్యేవాడే. అయినా కానీ వరుణ్‌ ఇంకా తన భార్యని కాపాడుకునే పిచ్చి ప్రయత్నం చేస్తూనే వున్నాడు. దీని వల్ల టైటిల్‌ కోల్పోవడమే కాదు, ఫైనల్స్‌కి ముందు ఎలిమినేట్‌ అయినా ఆశ్చర్యం లేదని షో ఫాలోవర్స్‌ అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English