మెగా స్కెచ్‌ వేసిన నాని!

మెగా స్కెచ్‌ వేసిన నాని!

టయర్‌ 2 హీరోలలో నానికి వున్నంత క్రెడిబులిటీ బిజినెస్‌ పరంగా ఇప్పుడు మరే హీరోకీ లేదు. రామ్‌, వరుణ్‌ తేజ్‌ హిట్స్‌ ఇచ్చినా కానీ నానిలా ఇంకా నిలకడ సాధించలేదు. వారి మార్కెట్‌ కూడా పాతిక కోట్లు దాటలేదు. అలాగే నితిన్‌, సాయి తేజ్‌ తదితర హీరోలు కూడా ప్రస్తుతం స్ట్రగులింగ్‌ ఫేజ్‌లోనే వున్నారు. విజయ్‌ దేవరకొండ తన దూకుడుకి తానే కళ్లెం వేసుకున్నాడు.

డియర్‌ కామ్రేడ్‌ ఫ్లాప్‌ అవడంతో విజయ్‌ డిఫెన్స్‌లో పడ్డాడు. దీంతో నానికి రీసెంట్‌ ఫ్లాప్‌ గ్యాంగ్‌లీడర్‌ వల్ల పెద్ద హెడ్డేక్‌ ఏమీ రాలేదు. తన స్థానానికి పోటీ ఏర్పడితే కంగారు పడాలి కానీ ప్రస్తుతానికి వచ్చిన డేంజర్‌ ఏమీ లేకపోవడంతో నాని మరోసారి మునుపటిలా కథలని అన్వేషించే పనిలో పడ్డాడు. అప్పట్లో నాని కథలు వినడానికే రోజులు కేటాయించేవాడు. ఓపిగ్గా విన్న కథల్లోంచి నచ్చినవి ఎంచుకుని చేసేవాడు. అలాగే అతనికి మంచి హిట్లు పడ్డాయి. గ్యాంగ్‌ లీడర్‌ తర్వాత నందిని రెడ్డి, శివ నిర్వాణ చెప్పిన కథలు విన్నా కానీ నాని అంతగా కన్విన్స్‌ అవలేదు.

అందుకని ఇప్పుడు రోజుకి కనీసం రెండు కథలయినా వింటూ కేవలం ఈ పని మీదే నాని ఉన్నాడు. ఇంకా అతడిని ఎక్సయిట్‌ చేసే సబ్జెక్ట్‌ దొరకలేదు కానీ ఇంత టైమ్‌ కేటాయించినపుడు ఖచ్చితంగా మంచి కథలు తారసపడతాయనడంలో సందేహం లేదు. అందులోను టయర్‌ 2 హీరోలు చేసే ఏ కథ అయినా నానిని దాటి వెళ్లాల్సిందే. నాని విని నచ్చలేదని చెప్పిన తర్వాతే మిగతా హీరోలని వెతుక్కుంటూ వెళుతోంది ఏదయినా. నాని ఇంత కేర్‌ తీసుకుంటూ మళ్లీ మునుపటిలా డ్రాయింగ్‌ బోర్డ్‌ దగ్గరకి వచ్చేసాడనేది తన సమవుజ్జీలకి బ్యాడ్‌ న్యూసే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English