అంత పోటీలోను సరిలేరు మహేష్‌కెవ్వరూ!

అంత పోటీలోను సరిలేరు మహేష్‌కెవ్వరూ!

సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరుకి పోటీగా కనీసం మూడు సినిమాలుంటాయనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరికి వారే తమ చిత్రంపై అపారమైన నమ్మకంతో పోటీని లెక్కచేయని వాతావరణం నెలకొంది. ఇంత పోటీ వున్నపుడు బయ్యర్లు భారీ రేట్లు ఆఫర్‌ చేయడానికి వెనకాడతారు. కానీ సరిలేరు నీకెవ్వరుపై మాత్రం పోటీ ప్రభావం అంతగా లేదని తేలిపోయింది. ఈ చిత్రాన్ని నైజాం, వైజాగ్‌తో పాటు ఈస్ట్‌ గోదావరిలో నిర్మాతలే స్వయంగా విడుదల చేసుకోనున్నారు. అవి కాకుండా మిగతా ఏరియాలకి గాను 'సరిలేరు నీకెవ్వరు' థియేట్రికల్‌ రైట్స్‌ డెబ్బయ్‌ కోట్ల వరకు పలుకుతున్నాయట.

ఇంత పోటీలో ఇది మామూలు రేట్‌ కాదని ట్రేడ్‌ వర్గాలే షాక్‌ అవుతున్నాయి. అనిల్‌ రావిపూడి ట్రాక్‌ రికార్డ్‌ని దృష్టిలో వుంచుకుని సరిలేరు నీకెవ్వరుపై బయ్యర్స్‌ చాలా నమ్మకంగా వున్నారు. సమ్మర్‌కి ఇతర చిత్రాలు చాలానే వున్నా కానీ పర్‌ఫెక్ట్‌ కమర్షియల్‌ చిత్రం మాత్రం ఇదొక్కటే.

ఇది ఖచ్చితంగా తనకు పోకిరి, దూకుడు రేంజ్‌ సినిమా అవుతుందనే మహేష్‌ కాన్ఫిడెన్స్‌, అల వైకుంఠపురములో రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసిన కాసేపటికే తమ చిత్రానికి కూడా అదే డేట్‌ ప్రకటించిన ఇన్సిడెంట్‌ లాంటివి కూడా 'సరిలేరు నీకెవ్వరు' క్రేజ్‌కి యాడ్‌ అయ్యాయి. దీనితో పోటీకి రావడం వల్ల 'అల వైకుంఠపురములో'కి ఆశించిన ధర పలకదని కూడా ట్రేడ్‌ అంచనా వేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English