తాప్సీకి అదే ఆఖరి డ్యూయెట్‌

తాప్సీకి అదే ఆఖరి డ్యూయెట్‌

నవ్వితే సొట్టలు పడే బుగ్గలతో తాప్సీ తెలుగింట బాగా ఫేమస్‌ అయిపోయింది. అయితే ఈ ఢల్లీి సొగసరికి ఇక్కడ అవకాశాలైతే వచ్చాయి గానీ, కెరీర్‌లో ఒక్క హిట్టూ పడలేదు. ‘గుండెల్లో గోదారి’ హిట్టయినా ఆ క్రెడిట్‌ అంతా మంచు లక్ష్మీ ఖాతోలో పడిపోయింది. రీసెంటుగా ‘షాడో’ భారీ ప్లాప్‌ అవడంతో అమ్మడికి అవకాశాల్లేకుండా పోయాయ్‌.

ప్రస్తుతం చేతిలో ఒక్క ‘సాహసం’ తప్ప వేరే సినిమాలేం లేవు. సాహసం త్వరలోనే రిలీజ్‌కి రెడీ అవుతోంది. దీని సక్సెస్‌పైనే ఈ ఢల్లీి సుందరి భవిష్యత్‌ ఆధారపడి ఉంది. అందునా సాహసంలో గోపీచంద్‌తో ఒకే ఒక్క డ్యూయెట్‌లో తాప్సీ కనిపించనుంది. ఓ రకంగా ఇదే తాప్సీ చిట్టచివరి డ్యూయెట్‌. ఈ సినిమా కూడా తేడా వస్తే తాప్సీ పూర్తిగా దుకాణం సర్దేసి రాజధానికి వెళ్లిపోవాల్సిందే. ఒకవేళ బాలీవుడ్‌లో ప్రయత్నిద్దామన్నా అక్కడా ప్రారంభ చిత్రంతోనే పెద్ద ప్లాప్‌ని చవిచూసింది. బాలీవుడ్‌ కూడా డైరెక్ట్‌గానే ఈ భామని రిజక్ట్‌ చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు