మతి పోగొట్టే పని పూర్తి చేసిన సమంత

మతి పోగొట్టే పని పూర్తి చేసిన సమంత

ఈ మధ్య కాలంలో దక్షిణాదిన వచ్చిన అత్యుత్తమ ప్రేమకథల్లో ‘96’ ఒకటి. నటుడిగా అప్పటికే ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసిన విజయ్ సేతుపతి.. ఈ సినిమాలో మరో అద్భుతమైన క్యారెక్టర్‌తో జనాల్ని మెస్మరైజ్ చేశారు. ఇక ఔట్ డేట్ అయిపోయిందనుకున్న త్రిష.. ఈ సినిమాలో తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల మతులు పోగొట్టింది. చాన్నాళ్ల తర్వాత త్రిష అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంది ఈ చిత్రంతో.

ఇప్పుడీ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత లాంటి మంచి జోడీని ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా ఎంచుకోవడంతో దీనికి మంచి క్రేజ్ వచ్చింది. ఈపాటికి విడుదలకు సిద్ధం కావాల్సిన ‘96’ తెలుగు రీమేక్.. మధ్యలో శర్వాకు గాయం కావడంతో ఆలస్యమైంది. ఐతే లేటుగా షూటింగ్ మొదలైనప్పటికీ.. ఈ చిత్రం వేగంగానే పూర్తయింది.

‘జాను’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లుగా స్వయంగా సమంతే వెల్లడించింది. సినిమాలోని తన లుక్‌ను పరిచయం చేస్తూ ఆమె ఒక ట్వీట్ చేసింది. సినిమా పూర్తయిందని.. ఈ సినిమా చేయడం మరపురాని అనుభవమని.. పేర్కొంది స‌మంత‌. ఈ సినిమా పేరు జాను అనే విష‌యాన్ని కూడా ఆమె ఖ‌రారు చేసింది.

త్రిష‌ను మించి స‌మంత మంచి పెర్ఫామ‌ర్‌గా పేరు తెచ్చుకుంది. గ‌త కొన్నేళ్ల‌లో అదిరిపోయే పాత్ర‌ల‌తో మెస్మ‌రైజ్ చేసింది. తాజాగా ఓ బేబీతో ఎలా అల‌రించిందో తెలిసిందే. అలాంటి న‌టికి 96లో హీరోయిన్ త‌ర‌హా పాత్ర ద‌క్కితే జ‌నాల మ‌తులు పోగొట్ట‌డం ఖాయం. స‌మంత లుక్ చూస్తేనే ఒక మంచి ఫీలింగ్ క‌లుగుతోంది. కాబ‌ట్టి ఈ సినిమాతో స‌మంత మ‌రోసారి ఏమాయ చేసావె అనిపించ‌డం ఖాయ‌మేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English