విజ‌య్‌కి త‌మ‌న్నా సారీ చెప్పాల‌ట‌.. ఎందుకో తెలుసా?

విజ‌య్‌కి త‌మ‌న్నా సారీ చెప్పాల‌ట‌.. ఎందుకో తెలుసా?

త‌మ ఆరాధ్య క‌థానాయ‌కుల మీద అభిమానం ఉండ‌టంలో త‌ప్పులేదు. కానీ ఆ అభిమానం మ‌రీ హ‌ద్దులు దాటిపోయి వేరే వాళ్ల‌పై విషం క‌క్కే స్థాయికి చేరిపోతుండ‌ట‌మే విచారించాల్సిన విష‌యం. సోష‌ల్ మీడియాలో కొన్నేళ్లుగా ఫ్యాన్ వార్స్ ఎలా సాగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా త‌మిళంలో విజ‌య్, అజిత్ అభిమానుల గొడ‌వ‌లు జుగుప్స క‌లిగిస్తుంటాయి.

త‌మ హీరో గురించో.. అత‌డి సినిమా గురించో పొర‌బాటున ఒక నెగెటివ్ కామెంట్ చేస్తే అంతే సంగ‌తులు. వాళ్ల‌ను టార్గెట్ చేసుకుని సోష‌ల్ మీడియాలో రెచ్చిపోతుంటారు. ఆ మ‌ధ్య అజిత్ అభిమానులు.. త‌మ హీరో సినిమా గురించి విమ‌ర్శించింద‌ని చిన్మ‌యిని ఇలాగే ల‌క్ష్యంగా చేసుకున్నారు. తాజాగా విజ‌య్ ఫ్యాన్స్.. త‌మ‌న్నా మీద ఫైర్ అయిపోతున్నారు.

అలాగ‌ని త‌మ‌న్నా విజ‌య్ గురించి నెగెటివ్ కామెంట్ కూడా చేయ‌లేదు. విజ‌య్‌తో క‌లిసి సుర అనే సినిమా చేశారు క‌దా, ఆయ‌న‌ గురించి మాట్లాడ‌మ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో అడిగితే ఆయ‌న గురించి త‌న‌కేమీ తెలియ‌దంది. దానికి వివ‌ర‌ణ కూడా ఇచ్చింది. ``విజ‌య్ స‌ర్ గురించి నాకేం తెలియదు. ఒక సినిమాలో ఆయనతో కలిసి నటించాను. కానీ, ఆ సమయంలో ఆయనకు, నాకు మధ్య ఎక్కువ కమ్యూనికేషన్ లేదు. ఆయన పనేదో ఆయనది అన్నట్టు ఉండేవారు. షూటింగ్‌కు వెళ్లామా? వచ్చామా? అన్నట్టు ఉండేది. అలాంటి వ్యక్తి గురించి నేనేం మాట్లాడను. ఆయన గురించి ఏమీ తెలియకుండా కామెంట్ చేయలేను అని చెప్పింది త‌మ‌న్నా. ఇందులో త‌ప్పేముంది? అయినా స‌రే విజ‌య్ ఫ్యాన్స్ హ‌ర్ట‌య్యారు. త‌మ‌న్నా విజ‌య్‌కి సారీ చెప్పాల‌ని డిమాండ్ చేస్తూ ట్విట్ట‌ర్లో పోస్టులు పెడుతున్నారు. ఇదేం విడ్డూర‌మో మ‌రి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English